iDreamPost
android-app
ios-app

చలి కాలంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే జుట్టు రాలమన్నా రాలదు

  • Published Dec 02, 2024 | 3:33 PM Updated Updated Dec 02, 2024 | 3:33 PM

చాలా మంది పురుషులు , మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు వేళల్లో ఖర్చు చేస్తున్నారు. రకరకాల షాంపూలు , ఆయిల్స్ , హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. అయినా సరే ఉపయోగం లేకుండా పోతుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు, దురద, పల్చని వెంటుక్రలు వంటి సమస్యలని నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు.

చాలా మంది పురుషులు , మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు వేళల్లో ఖర్చు చేస్తున్నారు. రకరకాల షాంపూలు , ఆయిల్స్ , హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. అయినా సరే ఉపయోగం లేకుండా పోతుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు, దురద, పల్చని వెంటుక్రలు వంటి సమస్యలని నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు.

  • Published Dec 02, 2024 | 3:33 PMUpdated Dec 02, 2024 | 3:33 PM
చలి కాలంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే జుట్టు రాలమన్నా రాలదు

ప్రస్తుతం వాతావరణంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు తినే ఆహారం కూడా కలుషితం అయిపోతుంది. ఈ క్రమంలో చాలా మంది పురుషులు , మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు వేళల్లో ఖర్చు చేస్తున్నారు. రకరకాల షాంపూలు , ఆయిల్స్ , హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. అయినా సరే ఉపయోగం లేకుండా పోతుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు, దురద, పల్చని వెంటుక్రలు వంటి సమస్యలని నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక చలికాలం అయితే ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చలికాలంలో పొడి వాతావరణం, పొల్యూషన్, చలి గాలి కారణంగా జుట్టు నిర్జీవంగా మారుతుంది. అయితే ఎలాంటి హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ లేకుండా సహజపద్ధుతులతోనే జుట్టు రాలిపోయే సమస్యకు చెక్ పెట్టొచ్చు. కొన్ని ఆహార పదార్థాల్ని తింటే జుట్టు ఆరోగ్యం మెరుగుపడంతో పాటు.. వేగంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూసేద్దాం.

చిలగడదుంపలు:
చలికాలంలో చిలకడ దుంపలు చాలా ఎక్కువగా లభిస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంతో పాటు జుట్టు ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిలో ఉండే పొటాషియం, మెగ్నిషియంతో జుట్టు దృఢంగా మారుతుందట. కాబట్టి ఈ సీజన్ లో దొరికే వీటిని అసలు మిస్ చేయకండి.

బాదం పప్పులు లేదా బాదం లడ్డు:
బాదం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుందని ఎప్పటినుంచో అందరికి తెలిసే ఉంటుంది. దీని వలన శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. వీటిలో విటమిన్ ఇ, బి, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే బాదం పప్పు తినడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పైగా వీటిని డైరెక్ట్ గా తీసుకోవడం కంటే కూడా.. బాదం లడ్డూలా తినడం వల్ల జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పును గ్రైండ్ చేసుకుని.. అందులో నెయ్యి, బెల్లం కలిపి లడ్డులా చేసుకుని.. ప్రతి రోజు ఉదయం ఒక బాదం లడ్డూను తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుందట. కాబాట్టి జుట్టు రాలడం సమస్యతో అధికంగా బాధపడే వారు.. దీనిని క్రమం తప్పకుండా పాటించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తుంది.

అవిసె గింజలు:
అవిసె గింజల్లో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండ అవిసె గింజలను తీసుకోవడం వలన జుట్టు పొడుగ్గా పెరుగుతుందట. పైగా అవిసె గింజల్లో ఉండే మెగ్నిషియం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వీటిని వేయించి తినడం వల్లన మరిన్ని లాభాలు కలుగుతాయట. లేదంటే అవిసె గింజల్ని వేయించి, పొడిగా చేసి నీళ్లలో లేదా పాలులో కలిపి తీసుకోవడం కూడా మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సోయాబీన్ :
సోయాబీన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని అనేక రకాలుగా డైట్ లో యాడ్ చేసుకోవచ్చు. సోయా చీజ్, సోయా మీల్క్, సోయా చంక్స్ ఇలా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం పుష్కలంగా ప్రోటీన్ లభిస్తుంది. అలాగే జుట్టు కుదుళ్ళు బలపడతాయి. కాబట్టి వీటిని కూడా డైట్ లో యాడ్ చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యలకు వీలైనంత త్వరగా చెక్ పెట్టొచ్చు.