పసుపు ప్రాణాలు తీస్తుందా.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

పసుపు అనగానే దానిలో ఉండే ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలే ముందుగా గుర్తుకు వస్తాయి. కానీ తాజాగా ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

పసుపు అనగానే దానిలో ఉండే ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలే ముందుగా గుర్తుకు వస్తాయి. కానీ తాజాగా ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

సాధారణంగా మన దేశంలో ఆహారాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు. అలానే వంటల్లో వాడే కొన్ని దినుసులు, పదార్థాలను ఇతర ప్రయోజనాల కోసం కూడా వాడతారు. ఈ జాబితాలో ముందుండే పదార్థం పసుపు. మన దగ్గర పసుపును వంటల్లోనే కాక.. శుభసూచకంగా కూడా భావిస్తారు. గడపకు పసుపు రాసి బొట్లు పెడతారు. అలానే మహిళలు ముఖానికి పసుపు రుద్దుకుంటారు.. కాళ్లకు కూడా పసుపు పెట్టుకుంటారు. ఇక వంటింటి పరంగా చూస్తే.. మన దగ్గర పసుపు లేకుండా ఏ వంట పూర్తి కాదు.

ఇక దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జలుబు చేసినప్పుడు పసుపు పాలు తాగుతారు.. అలానే గొంతు సమస్యల పరిష్కారం కోసం గోరు వెచ్చని నీటిలో పసుపు వేసి వాటిని పుక్కిలిస్తారు. ఇక జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం కోసం పసుపు వాడతారు. గాయం కాగానే వెంటనే కాసింత పసుపు రాస్తారు. ఇలా దీని వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి. అయితే తాజాగా పసుపుకు సంబంధించి శాస్త్రవేత్తలు ఓ షాకింగ్‌ విషయం వెల్లడించారు. ఆ వివరాలు..

వంటల్లో, ఆయుర్వేదం, ఔషధపరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగించే పసుపు ప్రాణాలు తీస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు. మనం వాడుతున్న పసుపు కాస్త సీసంలా మారి ప్రాణాలు తీస్తుందని.. అందుకోసమే బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పసుపు వాడకాన్ని నియంత్రించడానికి నడుం బిగించందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఎందుకంటే మన దేశంలోనే కాక మొత్త దక్షిణాసియా ప్రాంతంలో విరివిగా వాడే దినుసుల్లో పసుపు ఒకటి. ఇది వాడకుండ వంట చేయరు. కానీ ఈ పసుపు వల్ల ప్రజలు చనిపోతున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది. దీని కారణంగా చాలామంది ప్రజలు, చిన్నారుల, గుండె, మెదడు సంబంధిత వ్యాధుల బారినపడుతున్నట్లు పేర్కొంది.

బంగ్లాదేశ్‌లో షాకింగ్‌ సీన్‌..

2019లో ఈ పసుపు కారణంగా సుమారు 1.4 మిలియన్ల మరణాలు సంభవించినట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో బంగ్లాలోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డయేరియా డిసీజ్‌ రీసెర్చ్‌ బృందాలు, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిపి చేసిన పరిశోధనాల్లో పసుపుకి సంబంధించిన అనేక షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పసుపు వినియోగం వల్ల మనుషుల శరీరంలోకి సీసం చేరి ప్రాణాలు తీస్తుందని గుర్తించారు. ఇదేలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం పరిశోధనలు జరపగా.. కల్తీ పసుపు వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంటుందని వెల్లడయ్యింది.

కల్తీ పసుపు వినియోగం కారణంగా వ్యక్తుల శరీరంలోని రక్తంలో సీసం చేరి ఎలా ప్రాణాలు తీస్తుందో వివరించింది. ఇదేలా జరుగుతందని పలు అధ్యయనాలు జరపగా.. పసుపు కల్తీకి గురవ్వడం వల్ల .. అది ప్రాణాంతకంగా మారుతుందని గుర్తించారు. ముఖ్యంగా హోల్‌సేల్‌ మార్కెట్లోని వ్యాపారులు పసుపుని పెద్ద ఎత్తున కల్తీ చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ అధికారులు గుర్తించారు. దీన్ని వినియోగించినప్పుడు.. ఇందులో వాడిన రసాయనాల కారణంగా.. అది సీసంగా మారి మనుషుల ప్రాణాలు తీస్తుందని వెల్లడించారు. ఈక్రమంలో కల్తీకి అడ్డుకట్ట వేయడం కోసం బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నడుం బిగించింది. కల్తీ పసుపు అమ్మకం, వినియోగానికి చెక్‌ పెట్టేందుకు కృషి చేసింది.

కల్తీ పసుపు కట్టడి కోసం నడుం బిగించారు..

ముందుగా పసుపు మిల్లుల్లో పనిచేసే కార్మికుల రక్తంలోని సీసం స్థాయిలను చూసి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ తర్వాత దీనిపై దృష్టిసారించే పరిశోధనలకు నాంది పలికింది. అప్పుడే పసుపు పెద్ద ఎత్తున కల్తీ అవుతున్నట్లు గుర్తించింది. దీనికి సత్వరమే అడ్డుకట్టవేసి.. కల్తీ పసుపు వ్యాప్తిని అడ్డగిస్తూ.. చివరకు సున్నాకు తీసుకువచ్చింది. ఇక బంగ్లాదేశ్‌ ప్రభుత్వం చర్యల కారణంగా లక్షలాది ప్రాణాలను కాపాడగలిగింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కల్తీ పసుపు కారణంగా ప్రపంచంలోని సుమారు 815 మంది మిలియన్ల మంది పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ ప్రాణాంతక లోహం సీసం బారిన పడుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ పరిస్థితి పేద దేశాల్లో పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోందని వాషింగ్టన్‌లోని థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ పేర్కొంది. ఎన్నో ఔషధ లక్షణాలు పసుపు ప్రకృతి ప్రసాదించిన వరం. దాన్ని సక్రమంగా వాడితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొందరు తమ స్వార్థం కోసం దాన్ని కూడా కల్తీ చేస్తుండటంతో.. ప్రాణాలు కాపాడే పసుపు కాస్త.. ప్రాణాంతకంగా మారుతుందని.. అందుకు బంగ్లాదేశ్‌లో జరిగిన ఉదంతమే ఉదహారణ అంటున్నారు పరిశోధకులు.

Show comments