ఆధునిక సమాజపు పోకడలు సమూలంగా మారిపోతున్నాయి. టెక్నాలజీ విప్లవాలు కావొచ్చు.. అరచేతిలో బ్రహ్మండాల్ని ఇమిడ్చిన మొబైల్ ఫోను విప్లవాలు కావొచ్చు.. ఇప్పుడు నడుస్తున్నవి ఇదివరకటి రోజులు కాదు. పల్లెలో సాయంత్రం అయ్యేవేళకు నలుగురూ రచ్చబండ దగ్గర కూర్చుని కష్టసుఖాలు పంచుకుంటే.. ఇప్పుడు మొబైల్ ఫోన్ల విప్లవం వచ్చిన తర్వాత.. ఒక ఇంట్లో నలుగురు సభ్యులుంటే ఆ నలుగురు కూడా పరాయివాళ్ల లాగా మెలిగే పరిస్థితులే ఉన్నాయి. అనివార్యంగా మారిపోతున్న సామాజికపోకడలు ఇవి. ఈ విషవలయంలో మనం జాగ్రత్తగా ముందుకు వెళ్లడమే చేయగలిగిన పని. ఇక మనుషుల మధ్య మానవ సంబంధాలు ఎక్కడ మిగిలిఉన్నాయి.? నమ్మకం అంటే ప్రూఫ్ ఏది అనే రోజులివి..
అదీ వాడి కెపాసిటీ. అతని కథేంటో తెలియాలంటే ‘దోచేవారెవరురా’ సినిమా చూడాల్సిందే. శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన చిత్రమిది. బిత్తిరి సత్తి, అజయ్‌ఘోష్ కీలక పాత్రలు పోషించారు.
ఇటీవల ఈ చిత్రం నుంచి ఓ గీతాన్ని విడుదల చేశారు. ‘‘ఇది నా స్టైల్‌లో సాగే కామెడీ థ్రిలర్. కిల్లర్ సత్తి.. ఇప్పుడు శవంతో సెల్ఫీ ఎందుకు తీసుకొన్నాడో.. తర్వాత తంతూ అంతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటారు దర్శకుడు శివ నాగేశ్వర రావు..
ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం నవ్విస్తుంది. అజయ్ ఘోష్ ఇదివరకెప్పుడూ కనిపించని పాత్రలో దర్శనమిస్తాడు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని శివ నాగేశ్వరరావు తెలిపారు.