iDreamPost
android-app
ios-app

వీడియో: బుడగలమ్మే వ్యక్తి ఖరీదైన కారుతో సెల్ఫీ ప్రయత్నం.. ఓనర్ చేసిన పనికి హ్యాట్సాఫ్!

  • Published Aug 16, 2024 | 1:38 PM Updated Updated Aug 16, 2024 | 1:38 PM

Balloon Seller: మనం కోరుకున్నది మన వద్దకే చేరితే ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. మనం కల్లో కూడా ఊహించనిది నిజంగా జరిగితే ఆ ఆనందానికి అవధులు ఉండవు.. అలంటి అనుభవం ఓ బుడగలమ్మే వ్యక్తికి జరిగింది.

Balloon Seller: మనం కోరుకున్నది మన వద్దకే చేరితే ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. మనం కల్లో కూడా ఊహించనిది నిజంగా జరిగితే ఆ ఆనందానికి అవధులు ఉండవు.. అలంటి అనుభవం ఓ బుడగలమ్మే వ్యక్తికి జరిగింది.

  • Published Aug 16, 2024 | 1:38 PMUpdated Aug 16, 2024 | 1:38 PM
వీడియో: బుడగలమ్మే వ్యక్తి ఖరీదైన కారుతో సెల్ఫీ ప్రయత్నం.. ఓనర్ చేసిన పనికి హ్యాట్సాఫ్!

ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే..కొన్ని కన్నీరు తెప్పించేలా ఉంటున్నాయి. మరికొన్ని వీడియోలు ఇన్సిపిరేషనల్ గా ఉంటున్నాయి. ఇటీవల ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ కన్నా ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే వినియోగిస్తున్నారు. అందమైన ప్రదేశాలకు వెళ్లినా.. అబ్బుర పరిచేవి కంటపడినా వెంటనే వాటితో సెల్ఫీ దిగుతున్నారు. ఇక సెలబ్రెటీలు కనిపిస్తే ఎన్ని బాధలైనా పడి సెల్ఫీ దిగుతున్నారు. ఓ బుడగలమ్మే వ్యక్తి తన కూతురుతో ఖరీదైన కారు ముందు సెల్ఫీకోసం ప్రయత్నించాడు.. అంతలోనే ఓనర్ వచ్చాడు. అతని చేసి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

మనం కావాలనుకున్నది దక్కితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. జీవితంలో చాలా మందికి అలాంటి అనుభవం ఎప్పుడో ఒకసారి కలిగే ఉంటుంది. ఈ కాలంలో ఎవరి స్వార్థం వారిదే.. కానీ కొంతమంది తమ ఆనందాన్ని ఇతరుల సంతోషంలో వెతుక్కుంటారు.. అలాంటి వారు చాలా అరుదుగా కపిస్తుంటారు. ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియో చూసి చాలా మంది ఎమోషన్ అవుతున్నారు. ఆ వ్యక్తి చేసింది చిన్న సాయమే అయినా.. అవతలి వ్యక్తి జీవితంలో మర్చిపోలేని గుర్తుంగా ఉంటుందని అంటున్నారు. princevermareal అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చూపించినట్లు.. ఓ బుడగలు అమ్మే వ్యక్తి తన బిడ్డతో కలిసి ఓ ఖరీదైన కారు ముందు నిల్చొచి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అంతలోనే ఆ కారు యజమాని అక్కడికి వచ్చాడు.. ఏం చేస్తున్నావ్ అని బుడగలు అమ్మే వ్యక్తి అడగడంతో ఏం లేదు సార్ అంటూ అక్కడ నుంచి పక్కకు వెళ్లాడు. కారు యజమాని అతని వద్దకు వెళ్లి సెల్ తీసుకొని ఫోటోలు చూశాడు. కారుతో సెల్ఫీ దిగావా? కారు ఎక్కువతావా? అని అడిగాడు. దానికి బదులుగా ఇలాంటి కారు ఎక్కే అదృష్టం మాలాంటి వాళ్లకు ఉంటుందా సార్? అని బాధగా అన్నాడు. వెంటనే ఆ కారు ఓనర్ బుడగలు అమ్మే వ్యక్తిని అతడి కూతురుని తన కారులో కూర్చోబెట్టి టాప్ ఓపెన్ చేసి షికారు కొట్టాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. సంతోషంతో యజమానికి మొక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో 8 కోట్ల మందికి పైగా వీక్షించారు. కోటి మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. అతను మనసున్న మారాజు అని.. కొందరికి డబ్బుతో పాటు మంచి మనసు కూడా ఉంటుందని రుజువు చేశాని అని, చిన్న సాయమే అయినా ఆ బుడగలమ్మే వ్యక్తికి అది చాలా గొప్పది అంటూ కామెంట్స్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Prince Verma (@princevermareal)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom