iDreamPost
android-app
ios-app

ఐడ్రీమ్ మీడియా మాజీ యాంకర్లు చేసిన మిస్ లీడింగ్ థంబ్ ‌నెయిల్స్ ఆరోపణలపై.. ఐడ్రీమ్ మీడియా అధికారిక స్పందన

ఐడ్రీమ్ మీడియా మాజీ యాంకర్లు చేసిన మిస్ లీడింగ్ థంబ్ ‌నెయిల్స్ ఆరోపణలపై.. ఐడ్రీమ్ మీడియా అధికారిక స్పందన.

ఐడ్రీమ్ మీడియా మాజీ యాంకర్లు చేసిన మిస్ లీడింగ్ థంబ్ ‌నెయిల్స్ ఆరోపణలపై.. ఐడ్రీమ్ మీడియా అధికారిక స్పందన.

ఐడ్రీమ్ మీడియా మాజీ యాంకర్లు చేసిన మిస్ లీడింగ్ థంబ్ ‌నెయిల్స్ ఆరోపణలపై.. ఐడ్రీమ్ మీడియా అధికారిక స్పందన

ఐడ్రీమ్ మీడియా మాజీ యాంకర్లు చేసిన మిస్ లీడింగ్ థంబ్ ‌నెయిల్స్ ఆరోపణలపై.. ఐడ్రీమ్ మీడియా అధికారిక స్పందన

ఇది ఏమిటి, దేని గురించి?

 

ఐడ్రీమ్ మీడియా మాజీ యాంకర్లు S___&P___ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఐడ్రీమ్ మీడియా‌పై ఆరోపణలు చేశారు. ఐడ్రీమ్ మిస్ లీడింగ్ థంబ్ ‌నెయిల్స్ ప్రోత్సహిస్తుందని.. S___ ఈ విషయాన్ని అంతర్గతంగా పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలను కంపెనీ పట్టించుకోలేదని, దీని కారణంగా ఆమె రాజీనామా చేసిందని ఆరోపించారు.

ఈ నోట్ వారి ఆరోపణలకు ఐడ్రీమ్ మీడియా స్పందన.

 

సారాంశం:

 

  • ఆరోపణలను ఖండించడం: S___ & P___ చేసిన ఆరోపణలను ఐడ్రీమ్ మీడియా గట్టిగా ఖండిస్తోంది.
  • యాంకర్ రాజీనామాపై  వివరణ: ఐడ్రీమ్ లో S___కి నెలకు ₹4 లక్షల జీతం అనగా.. తెలుగు డిజిటల్ మీడియాలో అత్యధిక జీతం పొందే వారిలో S___ ఒకరు. నిజానికి ఆమె రాజీనామాకు కారణం ఎడిటోరియల్ విభేదాలు కాదు. పని పట్ల ఆమెలో నిబద్దత లోపించడం, అన్నిటికీ మించి వృత్తిపరమైన ప్రవర్తనే. (ఈ విషయంలో మరిన్ని వివరాల కోసం పూర్తిగా చదవండి)
  • వ్యక్తిగత సంప్రదింపులు విఫలం: ఈ మేటర్ ను సామరస్యంగా పరిష్కరించేందుకు ఐడ్రీమ్.. గౌరవప్రదంగానే S___ & P___ను  వాట్సాప్ ద్వారా సంప్రదించి (వారి ఆరోపణలను ఉపసంహరించుకునేలా ఒప్పించే) ప్రయత్నం చేసింది. కానీ వారు ఆరు వారాలు పైనే గడిచినా కూడా స్పందించలేదు.
  • యాంకర్ల బాధ్యతలు: వీడియో థంబ్ నెయిల్స్ విషయంలో యాంకర్లు నేరుగా, కీలక పాత్ర పోషిస్తారని ఐడ్రీమ్ మీడియా స్పష్టం చేస్తుంది. ఎస్‌ఈఓ(SEO) టీమ్స్ తో కలిసి వారు కో-ఆర్డినేట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. S___ & P___ సైతం గతంలో ఐడ్రీమ్ సంస్థలో ఇలానే పని చేశారు. థంబ్ ‌నెయిల్స్ విషయంలో వారు నిర్ణయాలు తీసుకునేవారు. ఇందుకు కావాల్సిన డాక్యుమెంటెడ్ ఆధారాలు (వాట్సాప్ మెసేజెస్) కూడా ఉన్నాయి. కాబట్టి.. మిస్ లీడింగ్ థంబ్స్ విషయంలో యాంకర్స్ కి  మాత్రం సంబంధం లేదు అని వారు క్లెయిమ్ చేసుకోవడం అర్థరహితం. ఎందుకంటే వారు  ప్రక్రియలో అంతర్భాగం.
  • ఇక అన్నిటికీ మించి S___ & P___ డిజిటల్ ఎథిక్స్ ‌కు  తమను తాము చాంపియన్‌లుగా చిత్రీకరించుకుని..  తీరా చూస్తే.. ఇప్పుడు వారు ఎలాంటి ఎడిటోరియల్ ప్రమాణాలు లేని.. మరొక డిజిటల్ మీడియా కంపెనీ ****లో జాయిన్ అయ్యారు. ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

ఐడ్రీమ్ మీడియా: ఒక దశాబ్దంపై నుండి తెలుగు డిజిటల్ కంటెంట్ లో మార్గదర్శకంగా ఉంది.

ఒక దశాబ్దంపై నుండి నిలకడగా అద్భుతమైన ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్న మొట్టమొదటి తెలుగు డిజిటిల్ మీడియా కంపెనీ ఐడ్రీమ్ అని చెప్పడానికి గర్విస్తున్నాము.  కారణంగానే డిజిటల్ స్పేస్ లో 10 ఏళ్ళ పై నుండి ఐడ్రీమ్ మీడియా లీడింగ్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో మేము అద్భుతమైన కార్యక్రమాలను రూపొందించాము. అంతేకాక.. భారతీయ డిజిటల్ మీడియాకు లాంగ్ ఫార్మ్ ఇంటర్వ్యూల కాన్సెప్ట్‌ ను పరిచయం చేసినందుకు గర్విస్తున్నాము. ఈ ప్రయాణంలో మేము చేసిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల వివరాలు:

  • పార్థసారథి గారితో విశ్వనాథామృతం సిరీస్: కళాతపస్వి కె విశ్వనాథ్ గారి చిత్రాలకు హృదయపూర్వక నివాళి ఈ సిరీస్. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు వంటి ప్రముఖులు ఈ సిరీస్ కి అతిథులుగా వచ్చారు. ఇంటర్వ్యూ సంబంధిత లింక్ కింద ఉంది.
  • ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్: తెలుగు డిజిటల్ మీడియా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్వ్యూ షోలలో ఇది ఒకటి. సంబంధిత లింక్ కింద ఉంది.
  • ఆర్మీ అధికారుల ఇంటర్వ్యూ సిరీస్: రిటైర్డ్ ఆర్మీ కల్నల్ హోస్ట్ ‌గా— 30 మందికి పైగా అవార్డీ— బ్రిగేడియర్లు, కల్నల్స్, రెజిమెంట్ అధికారులతో ఈ సిరీస్ రూపొందించాము. సంబంధిత లింక్ కింద ఉంది.
  • క్రైమ్ డైరీస్ విత్ మురళీధర్: 500 మందికి పైగా యూనిఫామ్డ్ పోలీసు అధికారులతో ఇంటర్వ్యూలు, అలాగే ఐపీఎస్(IPS), ఐఏఎస్(IAS), ఐఎఫ్ఎస్(IFS)  అధికారులను ఇంటర్వ్యూలు చేసి.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి గుర్తింపు పొందిన ల్యాండ్ మార్క్ సిరీస్ ఇది. సంబంధిత లింక్ కింద ఉంది.
  • ఐఏఎస్(IAS) అధికారుల ఇంటర్వ్యూ సిరీస్: ఐడ్రీమ్ మీడియా భారతదేశం నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో ఐఏఎస్(IAS) అధికారులను ఇంటర్వ్యూ చేసిన.. ఒకే ఒక్క తెలుగు డిజిటిల్ మీడియా హౌస్.
  • ప్రొఫెసర్ మృణాళిని గారితో అక్షర యాత్ర: తెలుగు సాహిత్యాన్ని సెలబ్రేట్ చేసుకునేలా ఉండే ఈ సిరీస్ ‌లో..  ఓల్గా, ఇంద్రగంటి వంటి ప్రముఖ రచయితలు పాల్గొన్నారు. సంబంధిత లింక్ కింద ఉంది.
  • సిరివెన్నెల గారి సిరీస్: లెజెండరీ గీత రచయిత జీవితం, వారి రచనలు గుర్తు చేసుకుంటూ.. ప్రముఖ అతిథులతో సాగే ఇంటర్వూస్. సంబంధిత లింక్ కింద ఉంది.

ఇలా సినీ లెజెండ్స్, మిలిటరీ అధికారులు, సాహితీ ప్రముఖులు, సమాజ నాయకులు మరియు ఉన్నత బ్యూరోక్రాట్లతో సహా వేలాది ప్రముఖ వ్యక్తులు తమ కథలను, అనుభవాలను చెప్పడానికి మాపై నమ్మకం ఉంచారు. మేము ఒక నిబద్ధత, నిజాయితీ, విలువలతో సరిగ్గా పని చేశాము కాబట్టే.. ఇంత మంది నమ్మకాన్ని పొంద కలిగాము.

ఎందుకు పబ్లిక్ గా స్పందిస్తున్నాం?

  • ఐడ్రీమ్ పై S___& P___ బహిరంగంగానే ఆరోపణలు (ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూప్స్ లో) చేశారు. అయినప్పటికీ.. మేము ముందుగా వారితో వ్యక్తిగత సంప్రదింపుల ద్వారానే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించాము. (S___కు మార్చి 29న, P___కు ఏప్రిల్ 4న) వాట్సాప్ లో మెసేజ్ లు పంపి.. గౌరవప్రదంగా వారిని సంప్రదించాము.
  • ఆరు వారాలు పైనే గడిచినా వారిద్దరి నుండి మాకు ఎటువంటి స్పందన రాలేదు. వారు తమ వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోలేదు.
  • దీనికి తోడు.. ఆఫ్ లైన్ లో వారు ఐడ్రీమ్ పై తప్పుడు ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని కొందరు వ్యక్తుల ద్వారా వినడం జరిగింది.
  • ఐడ్రీమ్ పై వారి సోషల్ మీడియా పోస్టు‌లు ఇప్పటికీ యాక్టివ్ ‌గా  ఉన్నాయి. ఇదే సమయంలో మేము చేసిన వ్యక్తిగత మెసేజ్ లకు  వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో.. మా స్పందనని బహిరంగంగా స్పష్టం చేయక తప్పలేదు. ఇది పూర్తిగా నీతిపరమైనది, చట్టబద్ధమైనది. ఈ విషయాన్ని మేము పూర్తిగా తనిఖీ చేసుకున్నాము.

ప్రధానఆరోపణపై స్పష్టీకరణ

యాంకర్ S___ థంబ్ ‌నెయిల్స్ ‌పై విభేదాల కారణంగా ఐడ్రీమ్ మీడియాను విడిచిపెట్టిందన్న ఆరోపణ పూర్తిగా అబద్ధం.

ఐడ్రీమ్ లో యాంకర్ S___ రాజీనామాకు నిజమైన కారణాలు:

ఐడ్రీమ్ ‌లో నవంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2025 వరకు (16 నెలలు) పని చేసిన సమయంలో యాంకర్ S.. నెలకు ₹4 లక్షల జీతం పొందేవారు. ఇది తెలుగు డిజిటల్ మీడియా రంగంలో అత్యధిక జీతం. కొన్ని కమర్షియల్ ఇంటర్వ్యూలు చేసినందుకు కూడా ఆమెకు అదనంగా రూ.2 లక్షలు పైనే చెల్లించాము.

  • చివరి పదేళ్ల కాలంలో ఆమెకు ఐడ్రీమ్ మీడియాలో ఇది 4వ ఇన్నింగ్స్. పైగా ఇది ఫుల్టైం జాబ్. ఇది కన్సల్టెంట్ రోల్ అని చెప్పడం తప్పు. తెలుగు డిజిటల్ స్పేస్ ‌లో ఏ కంపెనీ అయినా.. రోజుకు 2 గంటల కన్సల్టింగ్ జాబ్ ‌కు ₹4 లక్షల జీతం చెల్లించే పరిస్థితి ఉందా? మీరే ఆలోచించండి.
  • మొదట్లో ఆమె తన ఇంటర్వ్యూలకు స్వయంగా గెస్ట్ లను ఏర్పాటు చేసుకునేవారు. వైజాగ్, చెన్నైతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇతర ప్రదేశాలకు ఇంటర్వ్యూల కోసం ప్రయాణించారు. ఎస్‌ఈఓ(SEO)లతో వీడియో థంబ్ ‌నెయిల్స్ ‌పై పని చేశారు. ఇవన్నీ ఆమె బాధ్యతలలో భాగమే. ఇక ఐడ్రీమ్ లో S___కి మరో బాధ్యత ఉండేది. మిగతా అందరు యాంకర్లతో కలిసి కంటెంట్ క్రియేషన్ మెరుగుపరచడం ఆమె బాధ్యత. ఇలా ఆమె నిజానికి కంపెనీలో కంటెంట్ హెడ్గా ఉంది, అందుకే ₹4 లక్షల జీతం పొందేది.
  • ఉద్యోగంలో చేరిన కొన్నివారాల తర్వాత.. ఆమె ఒక టెలివిజన్ ఛానెల్‌లో పార్ట్ ‌టైమ్ గా (“వారానికి 1 లేదా 2 ఇంటర్వ్యూలు మాత్రమే” అని ఆమె చెప్పింది) వర్క్ చేయాల్సి వస్తుందని మాకు తెలియజేసింది. ఇది ఐడ్రీమ్ ‌లో  తన పనిని ఆటంకపరచదని హామీ ఇచ్చింది. అందుకు మేము అంగీకరించాము.
  • అయితే.. కాలక్రమేణా.. ఆమె ఐడ్రీమ్ సంస్థకి అందుబాటులో ఉండడం, పనితీరు క్రమంగా తగ్గాయి. మంచి గెస్ట్ లని తీసుకుని రావడం, మంచి ఇంటర్వ్యూలు చేయడం కూడా తగ్గింది. దీన్ని సరిచేయడానికి ఆమెకు సహాయంగా..  మేము ఒక డెడికేటెడ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ‌ను  కూడా నియమించాము.
  • ఆ తర్వాత, ఐడ్రీమ్ ‌లో ఆమె పని గంటలు గణనీయంగా తగ్గాయి. మొదట ఆమె పూర్తి రోజు పనిని సగం రోజుకు తగ్గించింది.
  • కొన్ని నెలల తర్వాత, ఆమె iDream Mediaలో రోజుకు 3 గంటలు మాత్రమే పని చేసేది. ఆ తర్వాత రోజుకు ఆ పనిని 2 గంటలకు తగ్గించింది.
  • అప్పటికే ఆమె  టెలివిజన్ ఛానెల్లో డిజిటల్ హెడ్గా  సీనియర్ రోల్ తీసుకున్నట్లు మాకు తెలిసింది. ఇది ఐడ్రీమ్ ‌కు తన సహకారాన్ని పూర్తిగా  ప్రభావితం చేసింది. అన్నిటికీ మించి నైతికంగా ఇది తప్పు అని స్పష్టంగా అర్ధం అవుతోంది.
  • ఆమె అక్కడితో ఆగలేదు. ఐడ్రీమ్ స్టూడియోలో ఒక్కచోట తప్ప.. బయట ఎక్కడా ఎటువంటి ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేయవద్దని ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ‌పై  ఒత్తిడి చేయడం ప్రారంభించింది.
  • చివరి ఘటన ఏమిటంటే.. ఒక గెస్ట్ ట్రాఫిక్ ‌లో  చిక్కుకుని కొన్ని నిమిషాలు ఆలస్యమైనప్పుడు.. ఆమె ఆఫీస్‌ నుండి సడెన్ గా బయటకి వెళ్లిపోయింది. ఇలా.. ఇంటర్వ్యూ షూట్ చేసే టీమ్ తో పాటు, గెస్ట్ ‌ను  కూడా ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది. ఇదే సమయంలో ఆమె ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, కెమెరా టీమ్ అవివేకంగా ప్రవర్తించారని, తన సమయాన్ని వృథా చేశారని వారి‌పై కోప్పడింది.
  • ఇంత జరిగాక.. ఈ సమస్యలకి చెక్ పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ఇందుకుగాను ఆమెని రోజుకు కనీసం 4 గంటలు ఆఫీస్ లో క్రమం తప్పకుండా ఉండాలని రిక్వెస్ట్ గానే కోరాము. నెలకు ₹4 లక్షల జీతం తీసుకునే ఓ ఉద్యోగిని.. ఇలా రిక్వెస్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు కదా? అందుకు తగ్గట్టు మేము ఆ నిబంధనను అమలు చేయడానికి ప్రయత్నించాము.
  • ఆ తర్వాత కొంతకాలానికే ఆమె రాజీనామా చేశారు. మేము అదే రోజు ఆమె రాజీనామాను అంగీకరించాము. తరువాత మేము ఆమెకు ఈ క్రింది సందేశం పంపాము. “హాయ్ S___.. నీపై ఎలాంటి కఠినమైన భావనలు లేవు. ఇది కుదరలేదు అంతే. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..” (ఈ సందేశాలకు మాకు ఆధారాలు ఉన్నాయి)
  • ఆమె కంపెనీ అంచనాలను అందుకోకపోవడం, తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, పని పట్ల నిబద్దత చూపకపోవడం వల్ల మాత్రమే రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేగాని.. ఆమె చెప్తున్నట్టు.. ఎడిటోరియల్ పద్ధతులపై విభేదాల కారణంగా రాజీనామా చేయలేదు అని ఇక్కడే స్పష్టంగా అర్ధం అవుతుంది.
  • నిజానికి ఐడ్రీమ్ లో రాజీనామా చేయాలనే ఉద్దేశ్యం S___కి లేకపోవచ్చు, కంపెనీ తనను ఉండమని ఒప్పించాలని ఆమె ఆశించి ఉండవచ్చు.  కానీ కంపెనీ ఆమె తప్పులని తీవ్రంగా పరిగణించి రాజీనామాను అంగీకరించింది. ఆమె రాజీనామా అంగీకరించిన తర్వాత సోషల్ పోస్ట్, BRK, మరియు సుమన్ టీవీలో ఇంటర్వ్యూలకు హాజరైన వాస్తవం ఈ వాదనకు మద్దతు ఇస్తుంది. బహుశా ఈ ఘటనలు ఆమె ఐడ్రీమ్ ‌పై  తప్పుడు ఆరోపణలు చేసే వైఖరికి దారితీసి ఉండవచ్చు.

వ్యక్తిగతంగా పరిష్కరించే ప్రయత్నాలు

S___ & P___ మాపై ఆరోపణలు చేశాక వారికి.. వ్యక్తిగతంగా వాట్సాప్ సందేశాలు పంపాము. వారికి మెసేజులు పంపి ఇప్పటికి ఆరు వారాలు పైనే అవుతున్నా వారిద్దరి నుండి ఎటువంటి స్పందన రాలేదు.

మేము వారికి పంపిన కీలక సందేశాలు క్రింద ఉన్నాయి:

యాంకర్ S కు మార్చి 29, 2025 పంపిన సందేశం:

హాయ్ S___,

 నీవు క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను.

 గత వారం జరిగిన పరిణామాలు నన్ను బాగా బాధించాయి.

గాయత్రి భార్గవి ఫిర్యాదులో  నిజమైన బాధ ఉంది. ఆమె వేదనను నేను నిజంగా అర్థం చేసుకున్నాను. నేను వ్యక్తిగతంగా ఆమెకు క్షమాపణ చెప్పడానికి సంప్రదించాను. అదే విధంగా నేను బహిరంగ క్షమాపణ కూడా  చెప్పాను.  సందేశం ఆమె గురించి కాదు – ఆమె చేసింది పూర్తిగా సమంజసం, ఆమె బాధను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను.”

 సమయంలో.. నీవు కూడా  సమస్యలోకి అనవసరంగా లాగబడ్డావని నేను భావించాను. “ఈ గందరగోళంలోకి నిన్ను లాగినందుకు వెరీ సారీ S___” అని వెంటనే నీకు మెసేజ్ పంపించాను. అయితే.., సంస్థతో ఇంత దీర్ఘకాల సంబంధం ఉన్నా.. నీవు  మెసేజ్ కి స్పందించకపోవడం నన్ను కొంచెం ఆశ్చర్యపరిచింది..

కొంత సమయం తర్వాత ఎవరో నాకు ఒక వీడియో ఫార్వార్డ్ చేశారు. అది నీ వీడియో. అందులో నీవు ఐడ్రీమ్ ను నిందించడమే కాక, చాలా కాలం నాటి సునీత ఎపిసోడ్ ను, అలాగే ప్రేమ వీడియో థంబ్ నెయిల్స్ గురించి ఆమె ఆందోళనలను (ఇవి నా దృష్టికి ఎప్పుడూ రాలేదు) ప్రస్తావించావు.  వీడియోకి, అందులో నీవు ఉపయోగించిన టోన్ కు.. నేను నిజంగా షాక్ అయ్యాను.

గతంలో నీవు చేసినట్లుగా.. కేవలం  కాల్  చేసి  లేదా  సందేశం  పంపి  ఉంటే..  నేను  వెంటనే    థంబ్  నెయిల్  వ్యవహారంలో  చర్య  తీసుకునేవాడిని. ఎవరైనా  ఆందోళన   వ్యక్తం  చేసినప్పుడు అటువంటి వీడియోలు లైవ్ లో ఉండనివ్వనని నీకు తెలుసు కూడా. ఇది ఎల్లప్పుడూ మా పని విధానం. ఇది నీకే కాదు, ఐడ్రీమ్ తో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కూడా తెలుసు.

తప్పులు జరిగి ఉండవచ్చు. కానీ, నేను ఉద్దేశపూర్వకంగా ఐడ్రీమ్ లో ఇటువంటి థంబ్ నెయిల్స్ ను ఎప్పుడూ ప్రోత్సహించను. అది ఎప్పటికీ జరగదు.       

———

నువ్వు, P___.. ఒక వ్యక్తికి ఫోన్ చేసి.. IDreamకి వ్యతిరేకంగా ఒక వీడియో చేసి, పోస్ట్ చేయమని కోరారు. ఆ వ్యక్తి.. మీ ఆడియో రికార్డు నాకు వినిపించారు. అలాగే, P___.. ఇతర జర్నలిస్టులతో ఉన్న వాట్సాప్ గ్రూప్ చాట్ లో ఐడ్రీమ్ ను నిందిస్తూ మెసేజ్ లు పంపినట్లు నేను చూశాను. నీవు, P___.. నాపై ఇంతటి విద్వేషభరితమైన ప్రచారం ఎందుకు చేస్తున్నారో నిజంగా నాకు తెలియదు.

 

నీకు నా గురించి ఎవరు ఏం చెప్పారు? నాపై ఇలాంటి తప్పుడు ప్రచారానికి నిన్ను ఎలా ఒప్పించారు? ఇవన్నీ నాకు తెలియదు. కానీ.., నీవు వాటిని నమ్మి ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే నీకు.. నేను చాలా చాలా సంవత్సరాలుగా తెలుసు.

 

నీవు కష్ట సమయాల్లో నన్ను ఎన్నో సార్లు సంప్రదించావు? నేను ఎల్లప్పుడూ నీకు నిజాయితీతో సహాయం చేయడానికి ప్రయత్నించాను.  విషయం నీకు కూడా తెలుసు.

 

  • యూఎస్ఏ(USA)లోనీవు కష్ట సమయంలో ఉన్నప్పుడు నన్ను సంప్రదించావు. అప్పుడు నేను నీకు ఐడ్రీమ్ లో 3 లక్షల రూపాయల జీతంతో సీఈఓ స్థానం ఇచ్చాను. (ఐడ్రీమ్ లో ఇది నీ 3వ ఇన్నింగ్స్)

 

  • ఐడ్రీమ్ లో నీకు ఇద్దరు సీనియర్ యాంకర్లతో సమస్యలు ఎదురైనప్పుడు, వారు కంపెనీలో సంవత్సరాలుగా ఉన్నప్పటికీ.. నేను నీ పక్షాన నిలిచాను. దీని ఫలితంగా వారు కంపెనీ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది కూడా.

 

  • నీవు నీ భర్తను యూఎస్ఏ(USA)లో కలవడానికి వెళ్లాలనుకున్నప్పుడు, నేను.. నీకోసం ఎమిరేట్స్ లో  బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేశాను (ఇది A380 డబుల్డెక్కర్ ఫ్లైట్ అని నిర్ధారించుకుని), దాదాపు $6000 ఖర్చు చేశాను. అదే విధంగా నీకు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఒక నెల చెల్లింపు సెలవు ఇచ్చాను (నీ జీతం నెలకు 3 లక్షలు ఉన్నప్పుడు).

 

  • నీ వివాహం చుట్టూ ఆన్ లైన్ లో ప్రతికూల చర్చ జరిగినప్పుడు, నేను వ్యక్తిగతంగా సమయం కేటాయించి, అన్ని వేదికల నుండి  ఆర్టికల్స్,  వీడియోలను తొలగించేలా చర్యలు తీసుకున్నాను.

 

  • నేను..  నిన్ను, యాంకర్ ప్రేమను, సిరాశ్రీని హైదరాబాద్ నుండి సియాటెల్(అమెరికా)కు ఆహ్వానించి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను.  ఇళయరాజా కచేరీకి హాజరయ్యేలా ఏర్పాటు చేశాను. నీవు.. వ్యక్తిగతంగా ఇళయరాజా గారిని కలిసేలా చేశాను.

 

నేను ఇవన్నీ నీ నుండి ఏదీ ఆశించి చేయలేదు. నా స్నేహితురాలు సంతోషంగా ఉండాలని, బాగుండాలని చేశాను. కానీ.. ఈరోజున నాపై ఇంతటి విద్వేషభరితమైన ప్రచారం చేస్తావని నేను ఊహించలేదు. నేను నిజంగా షాక్ అయ్యాను.

 

నాకు నీవు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పిన అన్ని మెసేజులు నా దగ్గర ఉన్నాయి – వాటిలో ఒకటి, కొన్ని నెలల క్రితం, పంపింది:

 

వాసు గారు యు ఆర్  బెస్ట్. నా మాటగా చెప్పచ్చు, నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను.”

 

నాకు ఒకప్పుడు తెలిసిన S___కు.. ఏమైందో నిజంగా అర్థం కావడం లేదు.

 

నీవు ఇటీవల ఐడ్రీమ్ నుండి వెళ్లిపోవడం వ్యక్తిగతం కాదు. అది వృత్తిపరమైన నిర్ణయం. నేను  తర్వాత పంపిన మెసేజ్ లో కూడా దాన్ని స్పష్టంగా పేర్కొన్నాను.

 

నేను ఎప్పుడైనా సమస్యల్లో ఉంటే.. నీవు నా కోసం ఉంటావని నేను నమ్మాను. ఎందుకంటే అది నీపై నాకు ఉన్న నమ్మకం.  విషయంలో నన్ను కొందరు హెచ్చరించినప్పటికీ నీపై నమ్మకం ఉంచాను.

 

కొందరు నాకు కాల్ చేసి.. మీపై అసత్య ఆరోపణలు చేయమని స్వప్న, ప్రేమ మాపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. గత 10+ సంవత్సరాల కాలంలో నీలో ఇలాంటి తీరును నేను ఎప్పుడూ చూడలేదు. నాపై ఇంతటి ఉద్దేశ్యపూర్వకమైన తప్పుడు ప్రచారం ఎందుకు?

 

మీరిద్దరూ తెలుగు డిజిటల్ మీడియాలో మిస్ లీడింగ్ థంబ్ నెయిల్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నయోధుల్లా మిమ్మల్ని మీరు చిత్రీకరించుకున్నారు. కానీ ఇప్పుడు నీవు  విషయంలో ఐడ్రీమ్ కంటే  మాత్రం బెటర్ గా లేని **** కంపెనీలో చేరావు. నిష్పాక్షికంగా చూసే ఎవరికైనా దీన్ని విస్మరించడం కష్టం

కొన్ని నెలల తర్వాత..   విషయాలు అన్నీ నార్మల్ అవుతాయి. అప్పుడు  ఎపిసోడ్ మొత్తంలో నీ తీరుపై ఒక్కసారి ఆలోచించి చూడు. ఆరోజున జరిగిన  దానికి నీవు చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతావు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే.. ఇది ఎంతో కాలంగా నాకు తెలిసిన S___ తీరులా అనిపించడం లేదు.

 

 ఆరోజు త్వరగా రావాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.

 

పిఎస్ 1: ఇది ఫిర్యాదు లేఖ కాదు. ఇది కేవలం నేను గత దశాబ్దం పాటు బాగా తెలిసిన వ్యక్తికి నా బాధ, నిరాశను వ్యక్తం చేయడం. నీవు ఐడ్రీమ్ లో నాలుగు సార్లు చేరి, నాలుగు సార్లు బయటకి వెళ్ళావు. ఒక్కసారి కూడా మనం వైరంతోనో, విబేధాలతోనో విడిపోలేదు. మరి.. ఇప్పుడే  ఎందుకు ఇలా? నాకు సమాధానం లేదు! P___ నిన్ను  విధంగా ప్రభావితం చేసిందేమో మరి!

 

పిఎస్ 2: P___కి నాపై ఇంతటి శత్రుత్వం ఎందుకు కలిగిందో నాకు నిజంగా అర్థం కావడం లేదు. P___ తన డిజిటల్ మీడియా కెరీర్ ను 8 సంవత్సరాల క్రితం ఐడ్రీమ్ తోనే ప్రారంభించింది. గత సెప్టెంబర్ లో  వార్షికోత్సవం సందర్భంగా నేను.. P___ను అభినందించాను.  సమయంలో మా మధ్య హృద్యమైన సంభాషణ జరిగింది.  తర్వాత ఏం మారిందో నాకు తెలియదు.

 

పిఎస్ 3: చివరిగా..  మొత్తం ప్రచారం నీ సొంత ఇమేజ్ ను కూడా దెబ్బ తీసింది. ఇది ఆలస్యంగా అయినా.. నీకు అర్ధం అవుతుందని  నేను ఆశిస్తున్నాను. ఎవరైనా నీకు ఇలా చేయమని సలహా ఇచ్చి ఉంటే,  ప్రతికూల ప్రభావాల నుండి నీవు దూరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.

 

పిఎస్ 4:  మొత్తం వ్యవహారంలో చాలా మంది బాధపడ్డా.. విచిత్రంగా P___మాత్రం తెలివిగా పక్కకి వెళ్ళిపోయిన ఏకైక వ్యక్తిగా కనిపిస్తోంది. ఆమె బహుశా నన్ను మాత్రమే కాకుండా.. అనుకోకుండా నిన్ను కూడా బాధపెట్టింది. అయితే..  మొత్తం వ్యవహారంలో ఆమె ఏం సాధిస్తుందో నాకు నిజంగా అర్థం కావడం లేదు.

 

పిఎస్ 5: నీవు దేవుడిని ఎక్కువగా నమ్ముతావని, దైవ భక్తి ఎక్కువని నాకు తెలుసు. ఒకవేళ నీవు, P___ ఆరోపించినట్టు నేను ఏదైనా ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేసిన వ్యక్తిని అయితే..  దేవుడే నన్ను జవాబుదారీగా మార్చాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.


  • మాజీ యాంకర్ P    కు పంపిన సందేశాలు::

    • మార్చి24, 2025 ఆమె.. మమ్మల్ని నిందిస్తూ పోస్టులు చేసిన తర్వాత.. ఆమెకి అది తప్పుడు సమాచారం అని వ్యక్తిగతంగా మొదటి మెసేజ్ చేసి చెప్పాము.

iDream Media’s Official Response to Allegations


  • ఏప్రిల్4, 2025 ఆమెకు పంపిన రెండవ సందేశం:

హాయ్ P___,

 

ఇటీవల S___ తన FB  వీడియోలో చేసిన వ్యాఖ్యలను నేను చూశాను. అందులో నీవు ఐడ్రీమ్ లో  నీ ఇంటర్వ్యూ వీడియోల కోసం ఉపయోగించిన థంబ్ నెయిల్స్ గురించి ఆందోళన వ్యక్తం చేశావని ఆమె చెప్పింది.

 

నిజానికి నీవు లేదా ఎవరూ నేరుగా  ఆందోళనలను నా దృష్టికి తీసుకురాలేదు. అయినప్పటికీ.. నీ వీడియోలకు ఏవైనా మిస్ లీడింగ్ థంబ్స్ ఉన్నాయో, లేవో నిర్ధారించుకోవడానికి టీమ్ ని క్రాస్ చెక్ చేయమని కోరాను. ఇప్పటివరకు.. వారు ఏదీ సమస్యాత్మకంగా గుర్తించలేదు.

 

మీ పాత ఇంటర్వ్యూలను తిరిగి ప్రచురించడం గురించి ఆందోళన ఉంటే..  కంటెంట్ అంతా ఐడ్రీమ్ యాజమాన్యం పరిధిలో ఉంది కాబట్టి, అది మా హక్కులలో భాగమని మరోసారి నీకు తెలియజేస్తున్నాను.

 

అయితే.. వాటిలో  ఎక్కడైనా మిస్ లీడింగ్ థంబ్స్ ఉన్నా, నిన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నట్లు అనిపించినా.. మరింకేమైనా అభ్యంతరాలు ఉన్నా దయచేసి వాటిని చూపించమని నేను నిజంగా కోరుతున్నాను. నేను వాటిని వెంటనే పరిష్కరిస్తాను.

ఈ మధ్య కాలంలో ఐడ్రీమ్ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. అలాగే మొదటి నుండి ఎడిటోరియల్ ఎథిక్స్ దాటకుండా మా కంపెనీ ముందుకి పోతుంది. కానీ.. ఇంత పెద్ద వాల్యూమ్ లో కంటెంట్ జనరేట్ చేస్తున్న సమయంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. అంతేగాని.. ఉద్దేశ్యపూర్వంకంగా ఎవరినీ ఇబ్బంది పెట్టాలి అన్నది మా అభిమతం కాదు. మేము ఫీడ్ బ్యాక్ ను  సీరియస్ గా  తీసుకుంటాము. సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నాము.  విషయంలో నీకు మాట ఇస్తున్నాను.

 

హృదయపూర్వక నమస్కారములతో,

V___

———

ఇంతకుముందు చెప్పినట్టు, మేము S___&P___తో మాట్లాడటానికి ప్రయత్నించి ఆరు వారాలు పైనే గడిచింది. అయినప్పటికీ వారిద్దరి నుండి  మెసేజ్ లకు ఎటువంటి స్పందన రాలేదు.

మరింత వివరణ: థంబ్ నెయిల్ నిర్ణయాలలో యాంకర్ల పాత్ర

  • S___చేసిన మరొక ఆరోపణయాంకర్లకు థంబ్ ‌నెయిల్ టెక్స్ట్ ‌లను నిర్ణయించడంలో ఎటువంటి పాత్ర లేదుఅనేది పూర్తిగా తప్పు.
  • వాస్తవానికి ఈ రంగంలో యాంకర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఐడ్రీమ్ లో కూడా యాంకర్లు ఎస్ఈఓ(SEO) టీమ్స్ తో చర్చించి సరైన థంబ్ నెయిల్స్ , టైటిల్స్ ను నిర్ణయిస్తారు. ఇది ఎప్పుడూ జరిగే  సాధారణ ప్రక్రియ. 
  • ఇది కేవలం విధానం మాత్రమే కాదు అవసరం కూడా. ప్రతిరోజూ అధిక మోతాదులో వీడియో కంటెంట్ పబ్లిష్ అవుతుండడం, డిజిటల్ మీడియా పని చేసే విధానం, వేగం కారణంగా యాంకర్లు ఎస్‌ఈఓ(SEO) టీమ్స్ తో చర్చించి సరైన థంబ్ ‌నెయిల్స్, టైటిల్స్ ‌ను  నిర్ణయించడం అవసరం కూడా.
  • నిజానికి డిజిటల్ మీడియా నిరంతరం అభివృద్ధి చెందుతున్న రంగం. సాంప్రదాయ బ్రాడ్ ‌కాస్ట్ జర్నలిజంలా కాకుండా, ఇక్కడ ప్రత్యేకమైన శిక్షణ సంస్థలు, ఇండస్ట్రీ-వైడ్ ప్రమాణాలు లేవు. అందువల్ల, ఈ డిజిటల్ ఆపరేషన్ల స్కేల్ ‌ను బట్టి, కంపెనీలు, యాంకర్లు, గెస్ట్ లు అందరూ కలిసి ఒక అత్యుత్తమైన మార్గంలో కంటెంట్ రూపొందించాల్సి ఉంటుంది. కాబట్టి.. ఇక్కడ అందరి ప్రమేయం తప్పక ఉంటుంది.
  • థంబ్ నెయిల్స్ ని మేనేజ్ చేయడం, కేర్ ఫుల్ గా చూసుకోవడంలో యాంకర్లు చురుకైన పాత్ర పోషించాలి. వారు ఇంటర్వ్యూలో గెస్ట్ తో పాటు ప్రధానంగా కనిపిస్తారు. కాబట్టి పేలవమైన థంబ్ నైల్.. గెస్ట్ ఇమేజ్ తో పాటు, యాంకర్ ఇమేజ్ ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు అరుదుగా ఉండే డిజిటల్-ఫస్ట్ ఫార్మాట్లలో ఇంటర్వ్యూకి వచ్చిన గెస్ట్.. ఏదైనా అవసరం వస్తే.. ముందుగా సంప్రదించేది యాంకర్ ని మాత్రమే.   (కొన్నిసార్లు ఏకైక) సంప్రదింపు వ్యక్తిగా కూడా యాంకర్ ఉంటారు. కాబట్టి.. యాంకర్స్ ఖచ్చితంగా తమ ఎస్ఈఓ(SEO) టీమ్స్ ని గైడ్ చేయడంలో బాధ్యత వహించాల్సి ఉంటుంది.
  • యాంకర్లువాట్సాప్ గ్రూప్ లేదా మరే మార్గం ద్వారా అయినా—ఎస్ఈఓ(SEO) టీమ్స్ తో నిరంతరం టచ్ లో ఉండాలి— ఇక ఇంటర్వ్యూ షూట్ అయ్యాక  వెంటనే థంబ్ ‌నెయిల్ టెక్స్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ మొత్తంలో కంటెంట్ ఏంటి? గెస్ట్ దేని గురించి మాట్లాడారు? అందులో హైలెట్ పాయింట్స్ ఏంటి ఇలాంటి అన్ని విషయాలను అంచనా వేయగలిగే బెస్ట్ పర్సన్ యాంకర్ మాత్రమే. 
  • ఎస్‌ఈఓ(SEO)లని యాంకర్స్ ఇలా సమన్వయం చేసుకుని, వారికి శిక్షణ ఇవ్వడం వల్ల ఎస్‌ఈఓ(SEO)ల పని సులభతరం అవుతుంది. ఇది సునాయాసమైన, సమర్థవంతమైన వర్క్ ఫ్లో  జరగడానికి తోడ్పడుతుంది.
  • ఐడ్రీమ్లో  ఎల్లప్పుడూ ఇదే జరిగింది. వాస్తవానికి, యాంకర్ S___ స్వయంగా తన హయాంలో వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఎస్‌ఈఓ(SEO) టీమ్స్ కి థంబ్ ‌నెయిల్ సూచనలను క్రమం తప్పకుండా షేర్ చేసింది. ఆమె అప్పుడు అంత చురుగ్గా ఈ పనిలో పాల్గొని.., ఇప్పుడు మాత్రం థంబ్ ‌నెయిల్స్ విషయంలో తనకి సంబంధం లేదని జీరో బాధ్యతను క్లెయిమ్ చేయడం నిజాయితీ లేని చర్యగా ఉంది.
  • మా వద్ద S___ (ప్రేమ, టీఎన్ఆర్, మరియు ఐడ్రీమ్ లోని ఇతర యాంకర్లు) కంపెనీ వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఎస్‌ఈఓ(SEO)లకు సూచించిన థంబ్ ‌నెయిల్ టెక్స్ట్ ‌ల  ఆధారాలు ఉన్నాయి. (వాట్సాప్ ‌లో గతంలో డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ లేనందుకు దేవుడికి ధన్యవాదాలు).
  • యాంకర్లు ఇంతలా ఈ ప్రక్రియలో అంతర్భాగంగా ఉన్నప్పుడు.. అప్పుడప్పుడు జరిగే  పొరపాట్ల నుండి తమను వేరు చేసుకోలేరు.
  • ఎవరైనా ( సందర్భంలో మాత్రం S___) ఆఫీస్ లో  రోజుకు కేవలం రెండు గంటలు గడిపినప్పుడు, వారు  అవసరమైన వర్క్ ఫ్లోలో, నాణ్యత తనిఖీలు చేయడంలో తప్పకుండా తడబాటుకు లోనవుతారు. ఎందుకంటే.. వారు కమిట్మెంట్ తో సంస్థకి తమ సమయాన్ని కేటాయించడం లేదు కదా! అప్పుడు వారు సౌకర్యవంతంగా  బాధ్యతను ఇతరులపై నెట్టడానికి ప్రయత్నిస్తారు.

ఇంత ఆలస్యంగా స్పందించడానికి కారణం?

 

  • ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన సమయంలో, మేము అప్పటికే శ్రీమతి గాయత్రి భార్గవి లేవనెత్తిన వేరే సున్నితమైన అంశాన్ని పరిష్కరిస్తున్నాము.  సమయంలో ఆమెతో గౌరవప్రదంగా సంప్రదించడం, ఆమెకి సంబంధం లేని ఇలాంటి విషయాలతో సంభాషణను గందరగోళం చేయకుండా ఉండటం మా ప్రాధాన్యత. అందుకే గాయత్రి భార్గవి గారి విషయంలో 100 శాతం చిత్తశుద్ధితో స్పందించాము.  గాయత్రి గారు కూడా థంబ్ ‌నెయిల్ సమస్య గురించి మా క్షమాపణను అంగీకరించి, ఐడ్రీమ్ మీడియాతో సానుకూల సంబంధాన్ని కొనసాగించడానికి ఓపెన్ ‌గా ఉన్నానని, వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
  • అలాగే.. S___& P___ “మేము ప్రైవేట్ గా చేసిన వాట్సాప్ మెసేజ్ లకి స్పందించి, నిర్మాణాత్మకంగా సంప్రదించి, తమ ఆరోపణలను వెనక్కి తీసుకుంటారని మేము ఆశించి కొంతకాలం ఎదురుచూశాము”. దురదృష్టవశాత్తు అది జరగలేదు.
  • మీరు గమనిస్తే ఈ మొత్తం విషయంలో.. మేముసమస్యను నిర్మాణాత్మకంగా పరిష్కరించడానికి ప్రయత్నించాము. ముందుగా అన్ని వాస్తవాలను సేకరించి, మా వైపు ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేసుకుని, ఆ తర్వాత స్పష్టతతో వివరణాత్మకంగా స్పందించాము. ఐడ్రీమ్/ఐడ్రీమ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఇప్పటికే వచ్చిన, లేదా భవిష్యత్తులో వచ్చే ఏవైనా ఆరోపణలు/ఫిర్యాదుల విషయంలో మా స్పందన ఇలానే ఉంటుంది.
    • ఈలోపల కొందరు మాపై ఉద్దేశ్యపూర్వక ఆరోపణలు చేసి,  క్షణిక ఆనందాన్ని ఆస్వాదించి, తాము విజయవంతమైనట్లు భావించవచ్చు. మాకు అదేమీ పెద్ద సమస్య కాదు. మేము ఎటువంటి గందరగోళానికి తావు ఇవ్వకుండా..  దీర్ఘకాలిక దృష్టితో మాత్రమే ఆలోచిస్తాము. కానీ.. మా మంచితనాన్ని.. బలహీనతలా తప్పుగా అర్థం చేసుకోవద్దు.

మా మాజీ యాంకర్లు S___మరియు P___ డబుల్ స్టాండర్డ్స్:

  • ఈ ఎపిసోడ్ మొత్తంలో.. S___ & P___ తమను తాము  డిజిటల్ మీడియాలో నీతిపరమైన పద్ధతులకు, ముఖ్యంగా థంబ్ ‌నెయిల్స్ విషయంలో ఛాంపియన్‌లుగా చిత్రీకరించుకున్నారు.

 

  • విచిత్రంగా, వారు ఇప్పుడు విలువల విషయంలో ఐడ్రీమ్ కంటే  మాత్రం బెటర్ గా లేని **** కంపెనీనిలో చేరారు. థంబ్ నెయిల్స్, ఎడిటోరియల్ ఎథిక్స్ విషయంలో ఇన్ని మాటలు చెప్పి వారు.. ఇప్పుడు  సంస్థలో కొనసాగడం ఎంత వరకు సబబు అనిపించుకుంటుందో తెలియదు మరి.

 

  • ఇది వారి అస్థిరత, ద్వంద్వ, నిజాయితీ లేని స్వభావాన్ని తేటతెల్లం చేస్తుంది. దీనిని గట్టిగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

చివరి మాట:

  • ఐడ్రీమ్ మీడియాలో థంబ్ నెయిల్ తప్పులను పూర్తిగా నివారించడానికి మేము నిరంతరం కృషి చేస్తాము. అయితే డిజిటల్ మీడియా అభివృద్ధి చెందుతున్న కొద్దీ అప్పుడప్పుడు అనుకోని రీతిలో చిన్న చిన్న తప్పులు జరగచ్చు. కావున మీ దృష్టికి ఇలాంటి సమస్య వచ్చినట్లయితే.. ముఖ్యంగా మీ ఇంటర్వ్యూ వీడియో థంబ్‌ నెయిల్‌ తో సమస్యను గమనించినట్లయితే, దయచేసి వీడియో లింక్ ని.. అలానే మీ వివరాలను info@iDreamMedia.com కి మెయిల్ చేయగలరు. మేము సదరు వీడియోని తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకుని.. మీరు సంతృప్తి చెందే రీతిలో సమస్యను పరిష్కరిస్తాము.
  • మా ఈ ప్రకటన కేవలం ఐడ్రీమ్ మీడియాపై చేసిన ఆరోపణలకు సమాధానం మాత్రమే. ఇక్కడ ఎవరినీ వ్యక్తిగతంగా దాడి చేయడం లేదా అవమానించడం మా ఉద్దేశ్యం కాదు. సరైన సందర్భంలో.. సరైన వాస్తవాలను బయట పెట్టడమే మా ముఖ్య ఉద్దేశ్యం.
  • మేము ఒక అంతర్గత పుకారును కూడా పరిశోధిస్తున్నాము. ఇందులో శ్రీమతి గాయత్రి భార్గవి గారు రైజ్ చేసిన మిస్ లీడింగ్ థంబ్ ‌నెయిల్ వీడియో.. నిజానికి కొన్ని నెలల క్రితమే ప్రైవేట్‌ చేయబడింది. కానీ.., ఈ వివాదం మొదలయ్యే  కొద్ది రోజుల ముందు ఉద్దేశ్యపూర్వకంగా ఎవరి ప్రేరణతోనో ఇది మళ్లీ పబ్లిక్ చేయబడింది. ఎవరో ఓ బలమైన వ్యక్తి.. ఎస్‌ఈఓ(SEO)ని సంప్రదించి, ఇంటర్వ్యూ గెస్ట్ ఆ వీడియో విడుదల చేయడానికి అంగీకరించారని.. తప్పుగా చెప్పి..  దాన్ని మళ్లీ పబ్లిక్ చేపించి ఉండవచ్చు అని మేము అనుమానిస్తున్నాము. ఈ విషయంలో మేము అంతర్గతంగా కూడా పరిశోధిస్తున్నాము. ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియ చాలా అనుమానాస్పదంగా ఉంది.
  • వివిధ బాధ్యతాయుత సంస్థలను నడిపే వ్యక్తులకు, ఇతర మీడియా సహచరులకు నిజాయితీతో మా విజ్ఞప్తి: చెడు ఉద్దేశాలతో, చెడు ఆలోచనలతో  పనిచేసే వ్యక్తుల పట్ల దయచేసి జాగ్రత్తగా ఉండండి. వారు తమని తాము బాధితులుగా చిత్రీకరించుకుంటూ..  ఇతరులను మోసం చేస్తారు. వీరి పట్ల అప్రమత్తంగా లేకపోతే..  మీరు, మీ సంస్థ/కంపెనీ, దానిపై ఆధారపడ్డ అనేక మంది భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. దయచేసి అప్రమత్తంగా ఉండండి.
  • లేఖలోని విషయాలకు మద్దతు ఇచ్చే అన్ని అవసరమైన సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి. ఎవరైనా దీనిని మరింత వివాదం చేసి, అదనపు అంతరాయాలు సృష్టించాలని కోరుకుంటే, మాకు చట్టపరమైన మార్గాన్ని అనుసరించడం, చట్టపరమైన మార్గదర్శకత్వంతో ఆడియో రికార్డింగ్ ‌లతో సహా అన్ని సంబంధిత సాక్ష్యాలను ప్రజా డొమైన్ ‌లో విడుదల చేయడం తప్ప వేరే మార్గం ఉండదు.
  • నిజాయితీ కలిగిన అభిప్రాయాలను ఐడ్రీమ్ ఎప్పుడూ స్వాగతిస్తుంది. నిరంతర అభివృద్ధి కోసం ఐడ్రీమ్ సంస్థ కట్టుబడి ఉంది. అయితే, నిరాధారమైన, తప్పుదారి పట్టించే ఆరోపణల నుంచి మా పని సమగ్రతను నిలబెట్టుకోవడం,మా బృందాన్ని కాపాడుకోవడం కూడా మా విధి.

కృతజ్ఞతలు

ఐడ్రీమ్ మీడియా బృందం 

17th May 2025