iDreamPost
android-app
ios-app

బలపడుతున్న అల్లు – బాలయ్యల బంధం

బలపడుతున్న అల్లు – బాలయ్యల బంధం

మాములుగా అభిమానుల మధ్య కొణిదెల నందమూరికి సంబంధించిన విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సోషల్ మీడియాలో అయితే మరీ అన్యాయంగా రాయలేనంత దారుణంగా తమ హీరోల గొప్పలు చెప్పుకోవడం కోసం తిట్ల స్తోత్రాలు ట్వీట్ చేస్తూ ఉంటారు. అయితే అల్లు ఫ్యామిలీ కూడా ఒకప్పుడు మెగా గొడుగు కిందే పరిగణించే వారు కానీ అల్లు అర్జున్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక స్వంతంగా స్టూడియో పెట్టడంతో మొదలుకుని ఆహా నడిపించే వరకు అన్నిట్లో తమదైన ముద్రను వేసుకున్నారు. ఇవి చిరంజీవి ఎప్పుడూ చేయని మాట వాస్తవం. ఇప్పుడు బాలయ్యకు అల్లు ఫ్యామిలీకి మధ్య బాండింగ్ అంతకంతా పెరుగుతూ పోవడం కొత్త సంకేతాలు ఇస్తోంది.

ఇటీవలే జరిగిన ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేయడం అంతో ఇంతో బజ్ ని తీసుకొచ్చింది. శిరీష్ ఆయనే ఫేవరెట్ హీరో అనే తరహాలో మాట్లాడి మెగాస్టార్ ప్రస్తావన లేకుండా ముగించాడు. ఇక అరవింద్ ఓసారి చిరు పేరు పలవరించినా తిరిగి ఆయన ప్రసంగం బాలయ్యను ప్రసన్నం చేసుకోవడం మీదే సాగిపోయింది. ఆహా అన్ స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ కావడంతో పాటు యాంకర్ గా తనకొచ్చిన పేరుని చూసి బాలకృష్ణ మహా ఆనందంగా ఉన్నారు. అందుకే అల్లు నుంచి ఏ ఆహ్వానం అందినా నో చెప్పడం లేదు. మాములుగా బయట ఇంటర్వ్యూలకు వద్దని చెప్పే బన్నీ సైతం ఫస్ట్ సీజన్ లో స్పెషల్ గెస్ట్ గా అలరించడం గుర్తే.

Nandamuri Balakrishna Calls Allu Aravind Pottodu

ఇదంతా ఒక వర్గం మెగా ఫ్యాన్స్ కు అంతగా నచ్చడం లేదు. అరవింద్ తలుచుకుంటే అదే టాక్ షోకో లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కో చిరంజీవిని తీసుకొచ్చేవారు. కానీ అలా జరగడం లేదు. ఇదంతా కావాలని చేస్తున్నారని కొందరు అభిమానుల ఫీలింగ్. ఇందులో నిజమెంతుందో చెప్పలేం కానీ ఆ మధ్య ఆలీ షోలో అరవింద్ అల్లు మెగా కుటుంబాల మధ్య అనుబంధం గురించి క్లారిటీ ఇస్తూనే ఏదో దాచిన భావన కలిగించారు. అసలు సాధ్యమే కాదనుకున్న మల్టీ స్టారర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఒప్పుకోవడం వల్ల ఆర్ఆర్ఆర్ రూపంలో వచ్చింది. చిరు తప్ప ఇంకెవరికి ప్రాధాన్యం ఇవ్వని అల్లు వారి ఫ్యామిలీ ఇప్పుడు బాలయ్యను ఆత్మీయుడిగా మార్చింది. అంతా కాల మహత్యం.