టెన్త్ పాసయ్యారా? ఎలాంటి ఎగ్జామ్ లేకుండా Airportలో ప్రభుత్వ ఉదోగాలు!

AI Airport Services Ltd (AIASL): AI Airport Services Ltd (AIASL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఆఫర్ చేస్తుంది.

AI Airport Services Ltd (AIASL): AI Airport Services Ltd (AIASL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఆఫర్ చేస్తుంది.

AI Airport Services Ltd (AIASL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌పోర్ట్ సర్వీసుల కోసం జాబ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ సంస్థ అయినా, ప్రభుత్వ రంగంతో కూడిన సంస్థగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి నిజంగా ఇది సూపర్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇక ఇంతకీ ఈ జాబ్స్ ఏంటి? వీటికి క్వాలిఫికేషన్ ఏంటి? మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ధరఖాస్తు ఫీజు ఎంత? ఎలా అప్లై చేసుకోవాలి? ఏజ్ లిమిట్ ఎంత? ఈ పోస్టులకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇంకా ఈ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మంచి విషయం ఏమిటంటే ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విజయవాడ, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈ ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అంటే చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. ఇక విద్యార్హతల విషయానికి వస్తే.. టెన్త్ క్లాస్, ఇంటర్మీడియెట్, డిప్లమా ఇంకా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.ఇందులో మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి. ఒకటి రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, రెండవది జూనియర్ ఆఫీసర్ (కస్టమర్ సర్వీస్), మూడవది యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్.. ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ ని బట్టి అభ్యర్ధులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే.. జూనియర్ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లేదా యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు మాత్రం కనీసం 10వ తరగతి పూర్తి కావాలి. అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారికి మాత్రం కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి.

ఇక ఈ మూడు పోస్టుల ఖాళీల విషయానికి వస్తే.. మొత్తం 13 ఖాళీలు ఉంటాయి. రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 1 పోస్టు, జూనియర్ ఆఫీసర్ (కస్టమర్ సర్వీస్) 4 పోస్టులు, యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్ 8 పోస్టులు..ఖాళీలు ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే.. ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారికి కచ్చితంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అయితే రిజర్వేషన్ కేటగిరీలకు మాత్రం వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు అయితే.. SC/ST అభ్యర్థులకు ఉండదు. ఇతర కేటగిరీ అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ప్రాసెస్ లో అప్లై చేయాలి. అంటే డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. నోటిఫికేషన్‌లో తెలిపిన తేది ఇంకా సమయానికి కచ్చితంగా లేట్ కాకుండా హాజరు కావాలి. ఇంటర్వ్యూ నవంబర్ 11, 12, తేదీల్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల దాకా ఉంటుంది.

ఇంటర్వ్యూ అడ్రస్ విషయానికి వస్తే.. NTR College of Veterinary Science. Opposite to Vijayawada International Airport, Gannavaram, Krishna district Andhra Pradesh – 521101. ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ కి విద్యార్హత సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, వయస్సు నిర్ధారణ పత్రం తీసుకు వెళ్ళాలి. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ వుంటే తీసుకు వెళ్ళండి. లేకున్నా పర్లేదు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారు మొదట 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలి. ఆ తరువాత వారి పెర్ఫామెన్స్ ని బట్టి పర్మినెంట్ చేస్తారు. ఇదీ సంగతి. కాబట్టి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments