iDreamPost
android-app
ios-app

సెల్ఫీ దిగిన 13 నిమిషాలకే యువకుల మృతి!

  • Published Nov 28, 2023 | 10:08 PM Updated Updated Nov 28, 2023 | 10:08 PM

ఎంతో సంతోషంగా సెల్ఫీ తీసుకున్న 13 నిమిషాల వ్యవధిలోనే దుర్మరణం చెందారు. మరి.. ఆ యువకుల సంతోషం వెనుక వచ్చిన మృత్యువు ఏమిటి? ఆవివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎంతో సంతోషంగా సెల్ఫీ తీసుకున్న 13 నిమిషాల వ్యవధిలోనే దుర్మరణం చెందారు. మరి.. ఆ యువకుల సంతోషం వెనుక వచ్చిన మృత్యువు ఏమిటి? ఆవివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సెల్ఫీ దిగిన 13 నిమిషాలకే యువకుల మృతి!

మరణం అనే పాము అనేది ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుంది. అయితే తనకు అవసరం వచ్చినప్పుడే మాత్రమే మనపై కాటు వేస్తుంది. ఆ విషయం తెలియక మనిషి ఎన్నో ఆశలతో జీవనం సాగిస్తుంటారు. అలానే ఎందరో మరణానికి క్షణం ముందు వరకు కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు. చివరకు అనుకోని ప్రమాదాలతో మృత్యుఒడికి చేరుతారు. తాజాగా ఓ ఇద్దరు యువకుల విషయంలో అదే జరిగింది. కాలుడు కాచుకుని కూర్చుని మరికొద్ది నిమిషాల్లో తమ ప్రాణాలు హరిస్తాడని ఆ యువకులకు తెలియదు. ఎంతో సంతోషంగా సెల్ఫీ తీసుకున్న 13 నిమిషాల వ్యవధిలోనే దుర్మరణం చెందారు. మరి.. ఆ యువకుల సంతోషం వెనుక వచ్చిన మృత్యువు ఏమిటి? ఆవివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రంజాన్ కుమార్(22) రోహిత్(24) అనే ఇద్దరు యువకులు హైదరాబాద్‌ అమీనాపూర్‌ లోని సాయిరాం రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరు వివిధ చోట్ల ఇళ్ల స్లాబ్‌ పనులను కాంట్రాక్టు పద్ధతిలో చేస్తుంటారు. రంజాన్‌ కుమార్‌, రోహిత్ లు అన్నవరంలో చేపట్టిన పనులను పరిశీలించడానికి హైదరాబాద్‌ నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచర్లగూడెం సమీపాన మాతంగమ్మమెట్ట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరు దుర్మరణం చెందారు. ఎదురుగా వచ్చిన లారీ, వారి ద్విచక్ర వాహనం పరస్పరం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

అంతేకాక ఈ ఇద్దరూ శిరస్త్రాణాలు ధరించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో రంజాన్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న రోహిత్‌ను 108 వాహనంలో స్థానిక స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రోహిత్ కూడా కొద్ది సమయంలో మృతి చెందాడు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాద స్థలాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్‌ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ ప్రమాదానికి 13 నిముషాల ముందు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం సమీపాన ఇద్దరు యువకులూ చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ తీసుకున్నారు.

సరిగ్గా 13 నిమిషాల తరువాత కరిచర్లగూడెం సమీపంలో మాతంగమ్మ మెట్ట వద్దకు చేరగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. అదే వారి చివరి ఫొటో. మృతుల ఫోన్ ఆధారంగా పోలీసులు ఈ ఫొటో సేకరించారు. మృతుల దగ్గర లభించిన ఆధారల ప్రకారం.. హైదరాబాదులో వారి బంధువులకూ సమాచారం పంపారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.