బురిడీ బాబా నిర్వాకం.. నేనే దేవుణ్ణి అంటూ..!

ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు బాబా ముసుగు ధరించి ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను నమ్మించి, కట్టు కథలు అల్ల ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి వారిని బుట్టలో వేసుకుంటారు. ఇక ఇంటితో ఆగుతారా అంటే అదీ లేదు. నీవు ఇలా చేస్తే మంచి జరుగుతుందని, డబ్బులు ఇవ్వాలని, దేవుని పేరు మీద బంగారం చేయించాలని ఇలా ఒకటేంటి.. ఎన్నో రకాల అబద్ధాలు చెప్పి వారి నుంచి అందిన కాడికి దోచుకుంటూ అమాయక ప్రజలను నట్టేట్ట ముంచుతున్నారు. అయితే అచ్చం ఇలాగే ఓ వ్యక్తి బాబా మసుగు ధరించి ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. అసలేం జరిగిందంటే

పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో అనీల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానిక అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని బాబా అవతారమెత్తాడు. ఇంతే కాకుండా.. సకల దేవతలు నాలో ఆవహించారని, నేనే దేవుణ్ణి అంటూ ఎంతో మందిని నమ్మించ సాగాడు. కోరిక కోర్కెలు తీరాలన్నా, చేసిన పాపాలు తొలగిపోవాలన్నా.. నాకు డబ్బులతో పాటు బంగారు, వెండి అభరణాలు చేయించాలని నమ్మించేవాడు. ఇక స్థానిక ప్రజలు అందరూ ఇదంతా నిజమే అనుకున్నారు.

దీంతో కోరినట్లుగానే ఎంతో మంది అతడికి లక్షల్లో డబ్బు చెల్లించారు. ఇంతే కాకుండా బంగారు, వెండి అభరణాలు సైతం చేయించారు. అయితే కొందరు బాధితులు ఇతని వ్యవహారాన్ని గమనించి.. వీడు ఫేక్ బాబా అని ఆలస్యంగా తెలుసుకున్నారు. ఇన్నాళ్లు మోసపోయామని గ్రహించి నెత్తి, నోరు బాదుకున్నారు. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఫేక్ బాబా అనీల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Show comments