Venkateswarlu
Venkateswarlu
ఓ తల్లి తన బిడ్డల కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుందని మనందరికీ తెలుసు. అవసరం అనుకున్నపుడు తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఓ తల్లి తన బిడ్డ ఫీజు కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైంది. తాను చనిపోతే డబ్బులు వస్తాయన్న ఆలోచనతో ఏకంగా బస్సు కిందపడింది. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన ఓ మహిళ కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. ఆమెది పేద కుటుంబం కావటంతో కుమారుడ్ని చదివించే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది. ఈ నేపథ్యంలోనే కుమారుడి కాలేజీ ఫీజు కట్టాల్సిన సమయం వచ్చింది. దాదాపు 45 వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, అంత పెద్ద మొత్తం కట్టడం ఆమెకు శక్తికి మించిన పని అయింది. అప్పు కోసం అక్కడా ఇక్కడ తిరిగింది. కానీ, అప్పు పుట్టలేదు.
డబ్బులు లేని కారణంగా బిడ్డ చదువు ఆగిపోతుందేమోనని ఆమె భయపడింది. అలాంటి సమయంలో ఆమెకో ఆలోచన వచ్చింది. తాను బస్సు కిందపడి చనిపోతే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని భావించింది. అనుకున్నదే తడువుగా రోడ్డు మీదకు వెళ్లింది. అటుగా వస్తున్న ఓ బస్సు కింద పడింది. దీంతో అక్కడికక్కడే మృత్యువాతపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ తల్లి చేసిన త్యాగానికి జోహార్లు చెబుతున్నారు. మరి, కుమారుడి ఫీజు కోసం ప్రాణాలు తీసుకున్న ఈ తల్లి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A mother in India kills herself jumping in front of a bus, hoping for family to get government assistance due to her death, so her son can pay the college fee. pic.twitter.com/jElX596vBu
— Ashok Swain (@ashoswai) July 17, 2023