Dharani
ఎవరిని నమ్మాలో అర్థం కానీ పరిస్థితి. రోజు రోజుకు దొంగలబెడద విపరీతంగా పెరుగుతోంది. ఇంట్లో నగదు ఉంచుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఆఖరికి బ్యాంకులను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇల్లు కన్నా బ్యాంకు పదిలమని భావించి.. డబ్బులు దాస్తే.. అందులో పని చేసే సిబ్బందే..
ఎవరిని నమ్మాలో అర్థం కానీ పరిస్థితి. రోజు రోజుకు దొంగలబెడద విపరీతంగా పెరుగుతోంది. ఇంట్లో నగదు ఉంచుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఆఖరికి బ్యాంకులను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇల్లు కన్నా బ్యాంకు పదిలమని భావించి.. డబ్బులు దాస్తే.. అందులో పని చేసే సిబ్బందే..
Dharani
నేటి కాలంలో చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడి.. దొంగతనాలు, సైబర్ నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కానీ పరిస్థితి. రోజు రోజుకు దొంగలబెడద విపరీతంగా పెరుగుతోంది. ఇంట్లో నగదు ఉంచుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఆఖరికి బ్యాంకులను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇల్లు కన్నా బ్యాంకు పదిలమని భావించి.. డబ్బులు దాస్తే.. అందులో పని చేసే సిబ్బందే.. ఖాతాదారుల సొమ్మును స్వాహా చేస్తున్నారు. తాజాగా ఓ బ్యాంక్ డీఏం ఖాతాదారులకు సంబంధించిన 8.5 కోట్ల రూపాయలను స్వాహా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ గేమ్స్ కోసం అతడు ఈ మొత్తాన్ని వినియోగించడం గమనార్హం. ఆ వివరాలు..
ఈ సంఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. ఖాతాదారుల సొమ్మును తన ఖాతాకు మళ్లించి.. ఆ మొత్తంతో ఆన్‌లైన్ గేమ్స్ఆడిన ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేట సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన బైరిశెట్టి కార్తీక్.. 2019 నుంచి నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ గోల్డ్లోన్రెన్యూవల్, క్లోజింగ్ట్రాన్సాక్షన్స్ విధులను నిర్వహించేవాడు.
అయితే నాలుగేళ్లుగా ఐదు దఫాల్లో సుమారు రూ.8.5కోట్లను తన బినామీ ఖాతాల్లోకి మళ్లించి క్రికెట్‌బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ఆడుతూ వచ్చాడు డీఎం కార్తీక్. ఇటీవల బ్యాంకు నిల్వల్లో తేడా రావడంతో అధికారులు కార్తీక్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో.. కార్తీక్ సుమారు 128 మంది కస్టమర్ల ఖాతాల నుంచి గోల్డ్లోన్స్కు సంబంధించిన డబ్బులను దారి మళ్లించినట్లు తేలింది. ఆడిట్ సమయంలో కస్టోడియన్, ఆడిటర్ల సంతకాలు సైతం ఫోర్జరీ చేసి క్లోజింగ్ చూపించాడని సీఐ తెలిపారు. నర్సంపేట బస్టాండ్‌లో కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నామని, రిమాండ్‌కు తరలిస్తామని వివరించారు.