P Krishna
Warangal Crime News: ఇటీవల చాలా మంది ప్రతి చిన్న వియానికి పెద్దగా రియాక్టు అవుతూ క్షణికావేశంలో దారుణాలకు పాల్పపడుతున్నారు.ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం, హత్యలకు పాల్పడటం లాంటివి జరుగుతుంది.
Warangal Crime News: ఇటీవల చాలా మంది ప్రతి చిన్న వియానికి పెద్దగా రియాక్టు అవుతూ క్షణికావేశంలో దారుణాలకు పాల్పపడుతున్నారు.ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం, హత్యలకు పాల్పడటం లాంటివి జరుగుతుంది.
P Krishna
ఈ మధ్య కాలంలో కొంతమంది చిన్న చిన్న విషయాలకు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం, తిట్టడం లాంటివి చేస్తున్నారు. పాత కక్ష్యలు, ఆర్థిక వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న గొడవలకే పగలు ప్రతీకారాలు పెంచుకొని కొట్టుకోవం, హత్యలు పాల్పపడటం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం ఓ పెళ్లి విషయంలో చెలరేగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి పగలు, ప్రతీకారాలకు దారి తీసింది. అందరూ హ్యాపీగా సినిమా చూసేందుకు వెళ్లగా థియేటర్లో దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లా వర్ధన్న పేటలో దారుణ ఘటన వెలుగు చూసింది.ఓ థియేటర్లో సినిమా ప్రారంభంమైన కొద్ది సేపటికే యువకుడిపై కత్తితో దాడి చేయగా..పక్కనే ఉన్న ప్రేక్షకులు భయంతో బయటకు పారిపోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో సినిమా ప్రదర్శన నిలిపివేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్దన్న పేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఊర రాజ్ కుమార్ పాత ఇనుప సామన్ల దుకాణం వ్యాపారి వద్ద మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అమ్మాపురానికి చెందిన కళ్లెం విజయ్ గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం రాజ్ కుమార్ తమ్ముడు కృష్ణ తన కూతురు విషయంలో విజయ్ తో గొడవపడ్డాడు. పెద్దల సమక్షంలో ఆ సమస్య పరిష్కరించుకున్నప్పటికీ కృష్ణ.. విజయ్ పై పగ పెంచుకున్నాడు. మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. శుక్రవారం రాజ్ కుమార్ ఉమ్మడి కుటుంబ సభ్యులు వన భోజనాలకు వెళ్లారు. సాయంత్రం ఫస్ట్ షో కొత్త సినిమా భారతీయుడు 2 చూసేందుకు థియేటర్ల కి వచ్చారు వీరిలో విజయ్ కూడా ఉన్నాడు.
సినిమా ప్రారంభం అయిన కొద్ది సేపటికే కృష్ణ తనతో తెచ్చుకున్న కత్తితో విజయ్ పై దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచాడు. ఈ ఘటన అడ్డుకోబోయిన గంధం రాజ్ కుమార్ సైతం గాయపడ్డాడు. ఘటన తర్వాత అక్కడ నుంచి నిందితుడు పరారయ్యాడు. క్షత గ్రాతులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం కి తరలించారు. ఘటనా స్థలాన్ని పోీసులు అధికారులు పరిశీలించి దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పారిపోయిన నింధితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్షణికావేశానికి ఇంత దారుణానికి పాల్పపడ కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.