P Krishna
Sangareddy Crime News: ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు ఇటు ఏడు తరాలు.. అటు ఏడు తరాలు చూసుకొని అన్ని ఓకే అనుకున్న తర్వాత తమ పిల్లలను ఒప్పించి ఘనంగా పెళ్లి జరిపించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. యువత ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు.
Sangareddy Crime News: ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు ఇటు ఏడు తరాలు.. అటు ఏడు తరాలు చూసుకొని అన్ని ఓకే అనుకున్న తర్వాత తమ పిల్లలను ఒప్పించి ఘనంగా పెళ్లి జరిపించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. యువత ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు.
P Krishna
పెద్దలు నిశ్చయించిన పెళ్లి కన్నా.. యువత తమకు నచ్చిన వారిని ప్రేమించి కొంత కాలం రిలేషన్ షిప్ కొనసాగించి ఆ తర్వతా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. రిలేషన్ షిప్ లో ఏమాత్రం తేడా వచ్చినా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. చాలా వరకు పెద్దలు ప్రేమ వివాహాలకు తీవ్ర వ్యతిరేకత చెబుతున్నారు. కొంతమంది యువత తమ ప్రేమను పెద్దలు అంగీకరించకోవడంతో అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. మరికొన్ని చోట్ల కులాంతర వివాహాలు చేసుకున్నందుకు కుటుంబ సభ్యులు పరువు హత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా తమ ప్రేమను పెద్దలు కాదన్నారని ఓ యువజంట సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. మంజీరా నదిలో అనుమానాస్పదంగా ప్రేమ జంట మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జూన్ 2 ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఈ జంట గురువారం న్యాల్‌కల్ మండలంలోని నదిలో మృతదేహాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్‌కల్ మండలం కాకి జనవాడ గ్రామానికి చెందిన బేగరి సదానందం (26) తన సమీప బంధువు ఉమ (22) ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో పెళ్లికి ససేమిరా అన్నారు. తాము కలిసి ఉంటామని.. తమ ప్రేమను ఎవరూ విడదీయలేరని పెద్దలకు చెప్పారు. కానీ పెద్దలు మాత్రం తీవ్ర అభ్యంతరం చెప్పారు.
తమ ప్రేమకు పెద్దలు అభ్యంతరం చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సదానందం, ఉమ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కలిసి జీవించలేని తాము కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2 న ఇంటి నుంచి ఇద్దరూ బైక్ పై వెళ్లిపోయారు. ఇద్దరూ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం హద్దరూను పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే న్యాల్‌కల్ మండలం పులకుర్తి వద్ద మంజీరా వంతెనపై బైక్, పాద రక్షలు గుర్తించారు పోలీసులు. గురువారం సాయంత్రం మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.