మంచి ఉద్యోగం, ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అంతలోనే..

Rayachoty Crime News: దేశంలో ఈ మద్య కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తున్నారు. అధిక పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు.. ఇతర కారణాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురవుతు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Rayachoty Crime News: దేశంలో ఈ మద్య కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తున్నారు. అధిక పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు.. ఇతర కారణాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురవుతు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఎదుటివారిపై చికాకు పడటం, కోపంతో తిట్టడం..కొట్టడం చేస్తున్నారు. మనస్థాపంతో తమ జీవితాలు అంతం చేసుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, ప్రేమ వ్యవహారాలు,వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల గొడవలు, కొట్లాటలు జరగడం.. మనస్థాపానికి గురై బాధపడటం చూస్తున్నాం. మంచి ఉద్యోగం, ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ముద్దులొలికే ఐదేళ్ల చిన్నారి.. ఇవన్నీ ఆమెకు సంతృప్తినివ్వలేదు.. ఎవరూ చేయరాని పని చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసింది..? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాయచోటిలోని ఎస్పీ ఆఫీస్ లో ఆదివారం సాయంత్రం విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి (28) తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. గార్డు డ్యూటీ గదిలోనే ఆమె తన గన్ తో కాల్చుకుంది. గార్డు గది నుంచి తుపాకీ శబ్ధం రావడంతో సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే వేదవతి మృతి చెందినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆమె భర్త దస్తగిరికి సమాచారం అందించారు. రాయచోటి పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె భర్త దస్తగిరిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వేదవతికి మదనపల్లెకు చెందిన దస్తగిరితో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఈ జంటకు ఐదేళ్ల కూతురు ఉంది. దస్తగిరికి వేదవతి రెండోభార్య. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరమైన దస్తగిరి.. వేదవతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న సమయంలో వేదవతి సెల్ ఫోన్ లో మాట్లాడారని.. ఆ సమయంలోనే తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పపడింది. వేదవతి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show comments