P Krishna
Pune Crime News: ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకు వస్తాయో తెలియదు.. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు.. ఆస్పత్రికి తరలించే లోగా మరణిస్తున్నారు.
Pune Crime News: ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకు వస్తాయో తెలియదు.. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు.. ఆస్పత్రికి తరలించే లోగా మరణిస్తున్నారు.
P Krishna
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఐపీఎల్ 2024 సందడి కనిపిస్తుంది. కోట్ల మంది ఐపీఎల్ మ్యాచ్ జరిగే సమయానికి టీవీలకు అతుక్కుపోతున్నారు. క్రికెట్ అంటే చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆట. భారత్ లో ప్రతి గల్లీలో పిలులు, పెద్దలు క్రికెట్ ఆడుతూ ఉంటారు. సాధారణంగా క్రికెట్ ఆడుతున్న సమయంలో అపశృతులు జరుగుతుంటాయి. మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియాదు. కొన్నిసార్లు క్రికెట్ బాల్ తగిలి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పిల్లులు ఔట్ డోర్, ఇండోర్ గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఇండోర్ స్టేడియంలో క్రికెట్ ఆడుతుండగా విషాద సంఘటన జరిగింది. ఈ ఘటన పూణేలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర పుణేలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.. 11 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతుండగా అతని ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలి మరణించాడు. మృతుడు శౌర్య కాళిదాస్ ఖాండ్వే గా గుర్తించారు. గురువారం లోహెగావ్‌లో ఈ సంఘటన జరిగింది.. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవిలో రికార్డు అయ్యాయి. క్రికెట్ బంతి ప్రైవేట్ పార్ట్ కి తగలడంతో బాలుడు అక్కడే కూలిపోయాడు. వెంటనే అతని స్నేహితులు పెద్దలకు చెప్పడంతో శౌర్య ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శౌర్య కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శౌర్య పూణేలోని రామన్ బాగ్ లో న్యూ ఇంగ్లీష్ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్నాడు.
ఈ కేసు దర్యాప్తు చుస్తున్న అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ సచిన్ ధామనే మాట్లాడుతూ.. ‘శౌర్య అను 11 ఏళ్ల బాలుడికి ప్రమాదవశాత్తు క్రికెట్ బంతి తగిలి మరణించాడని తెలియగానే వెంటనే వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టాం. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాత ఏం జరిగిందన్న విషయం గురించి తెలియజేస్తాం, అలాగే శౌర్యతో ఆడిన తోటి ఆటగాళ్లను విచారిస్తాం’ అని అన్నారు. శౌర్య మాయయ్య మాట్లాడుతూ.. ‘ మాది పెద్ద కుటుంబం.. శౌర్య ఎంతో ఎంతో ఉత్సాహంగ, ఆరోగ్యంగా ఉండేవాడు. పెద్దయ్యాక రెజ్లర్ కావాలన్నది అతి లక్ష్యం. చిన్నప్పట నుంచి క్రీడలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా క్రికెట్ ఆట అంటే ప్రాణం.. ఇప్పుడు ఆ ఇష్టమే ప్రాణాలు తీసింది’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.