P Krishna
ఈ మద్య కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళ కలిగిస్తున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు.
ఈ మద్య కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళ కలిగిస్తున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు.
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగం, డ్రైవింగ్ పై అవగాహన లేని వాళ్లు డ్రైవ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయి ఎంతోమంది అనాథలుగా మిగులుతున్నారు. నల్లగొండ జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..
అప్పటి వరకు పెళ్లింట సంతోషంగా గడిపిన కొంతమంది అంతలోనే విషాదంలో మునిగిపోయారు. మృత్యువు బస్సు ప్రమాదం రూపంలో కాటు వేసింది. నల్లగొండ జిల్లా చింతపల్లిలో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఒక మహిళ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన కొందిమంది గుంటూరు జిల్లా వినుకొండకు పెళ్లికి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటి వరకు హ్యాపీగా జర్ని చేస్తూ వస్తున్నారు.. అంతలోనే చింతపల్లి మండలం నాగార్జున సాగర్ – హైదరాబాద్ హైవే లారీ అసోసియేషన్ ఆఫీస్ వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాదంలో సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒక భారతమ్మ (50) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కన్నుమూసింది. మరో పదిహేను మందికి గాయాలు కాగా.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు చింతపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా.. కొంతమందిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.అప్పటి వరకు తమతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు చనిపోవడం, గాయపడటంతో పెళ్లి తీవ్ర విషాదం నెలకొంది.