P Krishna
గతంలో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లే విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెట్టేవారు.. సున్నితమైన మనసు ఉన్న విద్యార్థులు అది తట్టుకోలేక ఆత్మహత్యలకు పాలప్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
గతంలో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లే విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెట్టేవారు.. సున్నితమైన మనసు ఉన్న విద్యార్థులు అది తట్టుకోలేక ఆత్మహత్యలకు పాలప్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
P Krishna
ఈ రోజుల్లో చాలా మంది ప్రతి చిన్న విషయానికి ధైర్యాన్ని కోల్పోయి మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. చిన్న చిన్న కష్టాలకే ఓర్చుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడో ఇంటికి దూరంగా వసతి గృహాల్లో నివసించేవారు.. తల్లిదండ్రుల గురించి కనీసం ఆలోచించడం లేదు. ఎంతో మంది విద్యార్థులు తమకు మార్కులు సరిగా రాలేదనో.. ప్రేమ విఫలం అయిందనో.. ఇలా రక రకాల కారణాలు చెప్పి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు ఎక్కడో అక్కడ నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా , ఇటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బీఫార్మసీ చదివే విద్యార్థిని కేవలం తన తోటి స్నేహితులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నాగర్ కర్నూల్ జిల్లా చార కొండకు చెందిన విద్యార్థిని అనూష(23). ఈమె హైదరాబాద్ లోని శ్రీ ఇందు కళాశాలలో బీఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె తన స్నేహితులతో కలిసి హాస్టల్ లో నివసిస్తోంది. కాగా, ఆదివారం సాయంత్రం ఆమె తన తమ్ముడితో కలిసి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో హాస్టల్ లోని స్నేహితులు తనని వేధిస్తున్నారంటూ.. అనూష తన తల్లితండ్రులకు పిర్యాదు చేసింది. ఈ విషయమై మేము వారితో మాట్లాడతాము అంటూ.. కుటుంబ సభ్యులు ఆమెకు సర్ది చెప్పారు. కానీ, సోమవారం ఇంట్లోని వారంతా పొలం వెళ్లి.. తిరిగి వచ్చే సమయానికి అనూష విగత జీవిగా కనిపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనూష ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎదిగిన కూతురు తమ కళ్ళ ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
తన కన్న కూతురి విషయంలో జరిగినట్టు మరెవరికి జరగకూడదని.. మృతురాలి తండ్రి యాదయ్య పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న సీఐ సోమ నర్సయ్య చారుకొండకు చేరుకొని వివరాలు సేకరించారు. ఈ కేసు విషయమై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా, తోటివారు వేదించినంత మాత్రాన.. విద్యార్థులు ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అలానే కాలేజీ యాజమాన్యం కూడా ఇటువంటి చర్యల పట్ల.. పూర్తి బాధ్యత వహించాలి. ఇప్పటికే, నిత్యం ఇటువంటి వార్తలు తల్లితండ్రులను ఎంతో భయాందోళనలకు గురి చేస్తున్నాయి. చేతికి వచ్చిన పిల్లలు తమ చేతిలోనే ప్రాణాలను కోల్పోవడం అనేది విచారించ తగిన విషయం. మరి, నాగర్ కర్నూల్ లో బీఫార్మసీ విద్యార్థిని విషయంలో జరిగిన ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.