గోల్డ్ మెడలిస్ట్.. బంగారం లాంటి భవిష్యత్.. కానీ ఏం లాభం!

Mandya Crime News: పీజీలో గోల్డ్ మెడల్ సాధించిన ఓ యువతి మంచి ఉద్యోగం సంపాదించింది.. మరిన్ని విజయాలు అందుకోని జీవితంలో సెటిల్ అవ్వాలని ఎన్నో కలలు కన్నది.

Mandya Crime News: పీజీలో గోల్డ్ మెడల్ సాధించిన ఓ యువతి మంచి ఉద్యోగం సంపాదించింది.. మరిన్ని విజయాలు అందుకోని జీవితంలో సెటిల్ అవ్వాలని ఎన్నో కలలు కన్నది.

తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి సొసైటీలో మంచి ఉద్యోగాలు చేస్తూ గౌరవంగా బ్రతకాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు . ఇందుకోసం తమ పిల్లలకు చక్కటి విద్యనందించేందుకు కృషి చేస్తారు. కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఆశయాలు నిలబెడుతూ మంచి ర్యాంకులు సంపాదిస్తుంటారు. ఓ యువతి ఎంకాంలో బంగారు సాధించిన బెంగుళూరులో మంచి ఉద్యోగం సంపాదించింది. తమ కూతురు భవిష్యత్ లో మరింత ఉన్నత శిఖరాలు అందుకుంటుందని తల్లిదండ్రులు భావించారు.   మంచి సాలరీ.. హ్యాపీ లైఫ్ అనుకుంటున్న సమయంలోనే విధి వెక్కించింది. ఎంతో బంగారు భవిష్యత్ ని ఊహించుకున్న ఆ యువతి జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు మాండ్య రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి రైలు ప్రమాదంలో మృతి చెందింది. బెంగుళూరుకు చెందిన రమ్య (24) రైల్వే స్టేషన్ లోని రైల్వే ఓవర్‌పాస్ దగ్గర ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందింది. హంపీ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు నుంచి మైసూర్ వెళ్తుంది. ఆ సమయంలో ట్రాక్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు. ట్రాక్ త్వరగా దాటాలనే ఆలోచనలో ఉన్న రమ్య రైలును గమనించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటన శనివారం మాండ్య రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.

 

Show comments