పెళ్లైన ఆరు నెలలకే మనస్థాపంతో మహిళ బలవన్మరణం!

ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది ఆవేశంలో ఎదుటివారిపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఎక్కువగా ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలే కాకుండా వరకట్న వేధింపులు భరించలేక చాలా మంది మహిళలు బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు.  వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన జంట ఏడాది కూడా కలిసి ఉండటం లేదు.. వివిధ కారణాలతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా ఓ వివాహిత పెళ్లైన ఆరు నెలలకే తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడిన విషాదఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఈ మద్య కాలంలో చాలా మంది పలు కారణాలతో తీవ్రమైన మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ఏ విషయమైనా చర్చించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.. ఆ విషయం తెలిసి కూడా చాలా మంది ఆత్మహత్యల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఓ వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం మహబూబనగర్ మండలంలోని గుంపన్ పల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్థులు చెప్పిన వివరాల ప్రకారం.. గుంపన్ పల్లిలో గ్రామానికి చెందిన రాత్లావత్ భాస్కర్ కు లింగాల మండలం కి చెందిన నందిని(18) తో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. కొన్నిరోజులు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు. ఈ మద్యనే ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి.

ఇరువురు కుటుంబ పెద్దలు భార్యాభర్తలకు నచ్చజెప్పి కలిపారు. మళ్లీ కొన్నిరోజులుగా భాస్కర్, నందిని మద్య గొడవలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది నందిని. ఇక తన జీవితం మొత్తం ఇలాగే సాగుతుందని భావించి జీవితంపై విరక్తి చెందిన శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులు మందే సేవించింది. ఆపస్మారక స్థితిలో ఉన్న నందిని స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు నందినిని అచ్చంపేట హాస్పిటల్ కి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి పూర్తిగా విషమించిందని.. వెంటనే నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నందిని కన్నుమూసింది. అయితే ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Show comments