లండన్ వెళ్లిన మూడు నెలల్లోనే భారతీయ విద్యార్థి మృతి..!

విదేశఆల్లో ఎన్నో ఆశలతో అడుగు పెట్టిన విద్యార్ధులు హఠాత్తుగా కన్నుమూస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తీరని దుఖఃంలో మునిగిపోతున్నారు.

విదేశఆల్లో ఎన్నో ఆశలతో అడుగు పెట్టిన విద్యార్ధులు హఠాత్తుగా కన్నుమూస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తీరని దుఖఃంలో మునిగిపోతున్నారు.

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యనభ్యసించాలని.. సమాజంలో గొప్ప పేరు, ప్రతిష్ట, డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. ఇందుకోసం కష్టపడి పిల్లలను చదివిస్తుంటారు. ఉన్నత విద్య కోసం విదేశీ గడ్డపై కాలు పెట్టిన విద్యార్థులు రోడ్డు ప్రమాదాలు, చదువులో రాణించలేక డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం, దుండగుల చేతిలో హత్యకు గురి కావడం ఇలా ఎన్నో కారణాల వల్ల చనిపోతున్నారు. తల్లిదండ్రులకు తీరి దుఖాఃన్ని మిగుల్చుతున్నారు. ఈ మద్యనే అమెరికాలో ఢిల్లీ కి చెందిన ఆదిత్య అనే విద్యార్థిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన మరువక ముందే లండన్ లో మరో విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

గత నెల బ్రిటన్ లో మిస్ అయిన భారతీయ విద్యార్థి కథ విషాదాంతమైంది. 23 ఏళ్ల మిత్ కుమార్ం పటేల్ లండన్ లోని థేమ్స్ నదిలో అధికారులు గుర్తించారు. ఉన్నత చదువు కోసం మిత్ కుమార్ మూడు నెలల క్రితం యూకే వెళ్లాడు. నవంబర్ 17 నుంచి అతడు కనిపించకుండా పోయినట్లు స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే బంధువుల పోలీసులకు సమాచారం అందించి.. కేసు నమోదు చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 21న తూర్పు లండన్ లోని కానరీ వార్ప్ ప్రాంతంలోని థేమ్స్ నదిలో మిత్ కుమార్ మృతదేహాన్ని కనుగొన్నారు. చదువు కోసం వచ్చిన మిత్ ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అనుమానాస్పద మృతి కాదని పోలీసులు అంటున్నారు.

వ్యవసాయ కుటుంబానికి చెందిన మిత్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని విదేశీ గడ్డపై కాలు పెట్టాడు. అతడి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నట్లు అతడి బంధువుల పార్త్ పటేల్ తెలిపారు. ‘గో ఫండ్ మీ’ ఆన్ లైన్ ఫండ్ రైజర్ ద్వారా నిధులు సేకరిస్తున్నామని పార్త్ పటేల్ వెల్లడించారు. మిత్ కుమార్ వయసు 23 సంవత్సరాలు.. ఈ ఏడాది సెప్టెంబర్ 19న లండన్ వెళ్లాడు. కేవలం మూడు నెలల్లోనో ఘర విషాదం జరిగిపోయింది. ఎన్నో కలలు కన్న అమిత్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని మిత్ కుమార్ మృతదేహాన్ని భారత్ కు పంపిస్తామని అన్నారు.

Show comments