P Krishna
Gadag Crime News: ఈ మధ్య డబ్బు కోసం ఎలాంటి నేరాలకైనా తెగబడుతున్నారు కొంతమంది కేటుగాళ్ళు. సుపారీ తీసుకొని ప్రాణాలు తీస్తున్న గ్యాంగ్‌లు మరి ఎక్కువయ్యారు.
Gadag Crime News: ఈ మధ్య డబ్బు కోసం ఎలాంటి నేరాలకైనా తెగబడుతున్నారు కొంతమంది కేటుగాళ్ళు. సుపారీ తీసుకొని ప్రాణాలు తీస్తున్న గ్యాంగ్‌లు మరి ఎక్కువయ్యారు.
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత కక్ష్యలు, వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆస్తుల కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా హతమార్చడానికి వెనుకాడటం లేదు. అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల డబ్బు కోసం ఎలాంటి నేరాలకైనా పాల్పపడుతున్నారు నర హంతకులు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన బళ్లారిలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
గడగ్ నగరంలో గురువారం అర్ధరాత్రి మారణకాండ జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారణంగా హత్య చేయబడ్డారు. చనిపోయిన వారు పురపాలక సంఘం వైస్ చైర్మన్ సునంద బాక్లే కొడుకు కార్తీక్ (27), ప్రముఖ వ్యాపారి పరుశరామ(55), భార్య లక్ష్మీ(45) కూతురు ఆకాంక్ష(16) గా గుర్తించారు. కుటుంబ సభ్యులు పై అంతస్తులో గాఢ నిద్రలో ఉన్న సమయంలో హంతకులు చొరబడి వేట కొడవళ్ళతో విచక్షణారహితంగా దాడి చేసి మారణ కాండ సృష్టించినట్లు తెలుస్తుంది. గదిలో మృతదేహాలు చెల్ల చెదురుగా పడి ఉన్నాయి. అక్కడ వాతావరణం భీతావాహంగా కనిపిస్తుంది. నలుగురు దుండగుల భారిని రక్షించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించినట్లు కనిపిస్తుంది.
కొప్పకల్ లోని భాగ్యనగర్ లో నివాసం ఉంటున్న గడగ్ మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునంద బాక్లే తనయుడు కార్తీక్ బాక్లే వివాహ వేడుకకు వచ్చిన పరుశరామ, లక్ష్మీ, ఆకాంక్షలు ఏప్రిల్ కొప్పిల్ నుంచి గడక్ సిటీకి వచ్చారు. గురువారం రాత్రి ఆకాంక్ష పుట్టిన రోజు వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. బంధువుల ఒత్తిడి తో కార్తీక్ బాక్లే ఇంట్లోనే బసచేశారు. పరుశరామ నిద్రిస్తున్న ఇంట్లోకి దుండగులు ప్రవేశించి ముగ్గురిని హత్యచేశారు. శబ్ధాలు రావడంతో కార్తీక్ బాక్లే అక్కడకు వెళ్లగా అతన్ని కూడా విచక్షణారహితంగా నరికి చంపారు. తర్వాత ప్రకాశ్ బాక్లే ఆయన భార్య పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు సునంద ని నిద్రిస్తున్న ఇంటి తలుపు తట్టారు. వారు పోలీసులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే దుండగులు అక్కడ నుంచి పరార్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.