P Krishna
Karimnagar Crime News: ఇటీవల యువత డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగిపోతున్నారు. ఆ క్షణంలో తాము ఏం చేస్తున్నాయో అర్థంకాని పరిస్థితుల్లో ఎదుటివారిపై దాడులు చేయడం.. హత్యలకు సైతం తెగబడుతున్నారు.
Karimnagar Crime News: ఇటీవల యువత డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగిపోతున్నారు. ఆ క్షణంలో తాము ఏం చేస్తున్నాయో అర్థంకాని పరిస్థితుల్లో ఎదుటివారిపై దాడులు చేయడం.. హత్యలకు సైతం తెగబడుతున్నారు.
P Krishna
ఈ మధ్య కొంతమంది డబ్బు కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. కిడ్నాపులు, దొంగతనాలు, డ్రగ్స్ అమ్మకాలు, హైటెక్ వ్యభిచారాలు ఇలా ఎన్నో రకాల దందాలతో డబ్బు సంపాదిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, గంజాయి చాక్లెట్లు దొరికినట్లే దొరుకుతుంది. దాంతో పాటు మద్యం ఏరులై పారుతుంది. మద్యం, గంజాయి మత్తులో యువత జోగుతున్నారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న నేరాలకు పాల్పపడుతున్నారు.. కొన్నిసార్లు హత్యలకు తెగబడుతున్నారు. భూమి కోసం మొదలైన గొడవ యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పచ్చునూర్ కు చెందిన ప్రశాంత్ రెడ్డి (23) పై పలు కేసులు ఉండటంతో రౌడీ షీటర్ ఓపెన్ చేశారు పోలీసులు. అదే గ్రామానికి చెందిన మరో రౌడీ షీటర్ రమేష్ కి ఇటీవల ప్రశాంత్ రెడ్డితో గొడవ అయ్యింది. ఒక భూమి విషయంలో ఇద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ రెడ్డిని రమేష్ గ్యాంగ్ హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పచ్చునూర్ కి చెందిన గోపు రమ – రాఘునాథ రెడ్డి కి శ్యాం సుందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి కుమారులు. పదేళ్ల క్రితం అనారోగ్యంతో రమా, రాఘునాథ రెడ్డిలు చనిపోయారు. శ్యాం వరంగల్ లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి ఇంటర్ వరకు చదివి గ్రామంలోనే ఉంటున్నాడు. అతనిపై కొన్ని కేసులు నమోదు కావడంతో రౌడీ షీటర్ ఓపెన్ చేశారు పోలీసులు.
పచ్చునూర్ కే చెందిన మరో రౌడీ షీటర్ రమేష్ కి కొన్నిరోజుల నుంచి ప్రశాంత్ రెడ్డి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం గ్రామ శివారులోని శివాలయం వద్ద ప్రశాంత్ ని పట్టుకొని చితకబాదారు. తప్పించుకొని తగ్గరలోని నీళ్లు లేని బావిలో దూకాడు ప్రశాంత్. అయినా వదలకుండా బయటికి తీసుకువచ్చి కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లారు. ఆ తర్వాత అత్యంత పాశవికంగా హత్య చేసి చంపారు. గ్రామస్థుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మీపూర్, పచ్చనూర్ కు చెందిన కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 12 గంటల పాటు శ్రమించి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మానేర్ నదిలో ప్రశాంత్ రెడ్డి మృతదేహాన్ని గుర్తించరు. మృతుడి సోదరుడు శ్యాంసుందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.