వీడు మనిషేనా.. గదిలో పాము వదిలి భార్య, కూతురుని చంపాడు!

బంధువు, స్నేహితుల సమక్షంలో మూడు ముళ్లబంధంతో ఒక్కటైన జంట కొద్ది కాలంలోనే విడిపోతున్నారు. వివాహేతర సంబంధాలు.. ఇతర కారణాల వల్ల భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల్లో ఒకరినొకరు చంపుకుంటున్నారు.

బంధువు, స్నేహితుల సమక్షంలో మూడు ముళ్లబంధంతో ఒక్కటైన జంట కొద్ది కాలంలోనే విడిపోతున్నారు. వివాహేతర సంబంధాలు.. ఇతర కారణాల వల్ల భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల్లో ఒకరినొకరు చంపుకుంటున్నారు.

ఇటీవల కొంతమంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురై ఎదుటివారిపై దాడులు చేయడం.. చంపడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవడం లేదా హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. కట్టుకున్న భార్య, అన్యం పుణ్యం ఎరుగని కూతురిని ఓ కసాయి అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత హంతకుడి పాపం పండటంతో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గంజాం జిల్లా కబీసూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. అక్టోబర్ 7న ఓ మహిళ, రెండేళ్ల చిన్నారి ఇంట్లో శవాలుగా కనిపించారు. ఇద్దరూ పాము కాటుకు బలైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఇది సాధారణ మరణం కాదని.. కావాలని ఇద్దరిని ఎవరో పాముతో చంపించినట్లు పోలీసులు అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు చేయగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. చంపింది ఎవరో కాదు.. మహిళ భర్త అని పోలీసులు దర్యాప్తులో తేలింది. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల క్రితం అధేబరా గ్రామానికి చెందిన కె గణేష్ పాత్ర అదే గ్రామానికి చెందిన బసంతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొత్తలో ఇద్దరూ కలిసి మెలిసి బాగానే ఉన్నారు.. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో తరుచూ గొడవలు పెట్టుకోవడం.. భార్యపై చేయి చేసుకోవడం లాంటివి చేశాడు గణేష్.

భార్యతో తరుచూ గొడవల కారణంగా ఆమె అడ్డు తొలగించుకోవాలని గణేష్ పాత్ర దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పాములు పట్టే వ్యక్తిని పరిచయం చేసుకొని అతనికి కొంత డబ్బు చెల్లించి అత్యంత విషపూరితమైన పామును కొని ఓ ప్లాస్టీక్ జార్ లో అక్టోబర్ 6న ఇంటికి తీసుకు వచ్చాడు. భార్య, కూతురు నిద్రిస్తున్న గదిలోకి విషపూరితమైన పామును వదిలిపెట్టి మరో గదిలో నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి భార్య, కూతురు విగతజీవులైన పడి ఉన్నారు. తన భార్యా, బిడ్డ పాము కాటుకు గురై చనిపోయారని ఊరంతా నమ్మించాడు. కానీ అత్తమామలకు గణేష్ తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మొదట గణేష్ పాత్రను పోలీసులు విచారణ చేయగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. కానీ తమదైన స్టైల్లో పోలీసులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టాడు. దీంతో గణేష్ ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.. కేసు దర్యాప్త కొనసాగుతుందని కవిసూర్యనగర్ ఐఐసి ప్రభాత్ కుమార్ సాహు తెలిపారు.

Show comments