Keerthi
ఇటీవల కాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందుల కోసం ఇన్‌స్టంట్ లోన్ పేరిట క్షణాల్లో నగదు ఇచ్చే యాప్ లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కానీ, ఆ లోన్ యాప్ నిర్వాహకులు సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఈ లోన్ యాప్ ల వేధింపులు ఎక్కువ్వంతో ఓ యువకుడు ఏం చేశాడంటే..
ఇటీవల కాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందుల కోసం ఇన్‌స్టంట్ లోన్ పేరిట క్షణాల్లో నగదు ఇచ్చే యాప్ లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కానీ, ఆ లోన్ యాప్ నిర్వాహకులు సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఈ లోన్ యాప్ ల వేధింపులు ఎక్కువ్వంతో ఓ యువకుడు ఏం చేశాడంటే..
Keerthi
ప్రస్తుత కాలంలో చాలామంది నిత్య అవసరాల కోసం, ఆర్థిక ఇబ్బందుల కోసం ఇన్‌స్టంట్ లోన్ పేరిట క్షణాల్లో నగదు ఇచ్చే యాప్ లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కానీ, ఆ లోన్ యాప్ నిర్వాహకులు సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. క్షణాల్లో డబ్బులు ఇచ్చే విధంగా ప్రజలకు ఆశ చూపిన ఈ సంస్థలు.. వడ్దీ, చక్రవడ్డీ , బారు వడ్డీల పేరుతో సామాన్యులను తీవ్రంగా వేధిస్తున్నారు. అయితే అప్పటికప్పుడు డబ్బులు వచ్చి అవసరాలు తీరుతున్నాయనే నేపథ్యంలో ఆశపడి.. వీటి మాయాలో ప్రజలు బలైపోతున్నారు. ఎందుకంటే.. ప్రజల అవసరాలకు ఆశపడి తీసుకున్న ఈ లోన్ కు వారి దగ్గర నాలుగింతలు ఎక్కువగా డబ్బులు గుంజుతున్నారు. ఒకవేళ చెల్లించకపోతే కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు కూడా అసభ్య మెసేజులు పంపుతూ వేధించడంతో చాలామంది ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు బలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
తాజాగా ఆర్థిక అవసరం కోసం ఓ యువకుడు రుణ యాప్ లో కొంత నగదు తీసుకున్నాడు. అయితే ఎంత కడుతున్న భాకీ ఉందంటూ నిర్వాహకులు వేధింపులు ఎక్కువైపోవడంతో.. ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో జోగిపేట ఎస్సై అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్ సానిపల్లి గ్రామానికి చెందిన కాడెం శ్రీకాంత్ (23) అదే జిల్లా సదాశివవపేటలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నాలుగు నాలుగు నెలల క్రితం ఓ లోన్ యాప్ లో రూ .1.30 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే క్రమంతప్పకుండా.. ఆ రుణం చెల్లిస్తునే వచ్చాడు. కానీ, ఎంత కడుతున్న ఇంకా బాకీ ఉందంటూ..యాప్ నిర్వాహకులలు వేధించసాగారు. పైగా అతని సెల్ ఫోన్ కు అసభ్యకర ఫోటోలను పంపించారు. అయితే వారి వేధింపులు తాళలేని శ్రీకాంత్ గత నెల 30న ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. ఇక ఇది గమనించిన కుటుంబ సభ్యలు వెంటనే అతనిని హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరి, లోన్ యాప్ నిర్వహకుల వేధింపులకు మరో యువకుడు బలికావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.