Arjun Suravaram
Arjun Suravaram
నేటికాలంలో జరుగుతున్న నేరాల్లో ఎక్కవ శాతం, వివాహేతర సంబంధాలు, ఆస్తి విషయాలు, ఆర్థిక లావాదేవీల కారణంగానే జరుగుతున్నాయి. కొందరు ఆస్తి కోసం.. రక్త సంబంధాలను కూడా మరచి ప్రవర్తిస్తున్నారు. బంధాల కంటే ఆస్తే ముఖ్యం అన్నట్లు కొందరి తీరు ఉంది. అడుగు భూమి కోసం అన్నదమ్ములు ఘర్షణ పడుతున్నారు. చివరకు ఎవరో ఒకరు దారుణ హత్యకు గురవుతున్నారు. తాజాగా ఆస్తి కోసం ముగ్గురిని సొంత బంధువులే దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
ధూళిపాళ్లకు చెందిన పెద్దమీర్సా, చిన్నమీర్సా అనే సోదరులు ఉన్నారు. పెద్దమీర్సా కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సత్తెనపల్లికి వచ్చి స్థిర పడ్డారు. చిన్నమీర్సా కుటుంబం మాత్రం స్వగ్రామంలోనే జీవిస్తోంది. ఈ అన్నదమ్ములిద్దరు కొన్నాళ్ల క్రితం మృతి చెందారు. చిన్నమీర్సా భార్య షేక్ రహిమున్నీసా(65), కుమార్తె మాలింబీ(36), కుమారుడు రహమాన్(38) ఉన్నారు. ఈ కుటుంబానికి రెండు ఎకారల పొలం ఉంది. ఆ పొలంపై పెద్దమీర్సా కుమారుడు ఖాసిం కన్నేశాడు. పొలంలో సగభాగం తనకు రాసివ్వాలని..తన చిన్నమ్మ రహిమున్నీసాతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఖాసిం తన కుమారుడైన బాలుడితో కలిసి సత్తెనపల్లి నుంచి ధూళిపాళ్లకు బయలు దేరాడు. మార్గం మధ్యలో ఎదురైన రహమాన్ ను చంపేసి… మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి సమీపంలో ఉన్న ఓ దాబా వెనుక గుంతలో పడేశాడు.
అనంతరం రహమున్నీసా ఇంటికి వెళ్లి.. కర్రలతో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మాలింబీని కూడా విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో రహమున్నీసా అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కుమార్తె సత్తెనపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి అనంతరం నిందితులు పరారయ్యారు. ఆస్తి కోసం ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్యకు గురి కావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. మరి.. ఆస్తులు, డబ్బుల కోసం రక్త సంబంధాలను కూడా లెక్క చేయడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. మరి.. ఆస్తుల కోసం ఇలా సొంత వారిని హత్య చేస్తున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.