Arjun Suravaram
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. పరాయి మగాడి సుఖం కోసం ఆశ పడి..పచ్చని సంసారంతో పాటు నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరులో ఓ దారుణం చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. పరాయి మగాడి సుఖం కోసం ఆశ పడి..పచ్చని సంసారంతో పాటు నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరులో ఓ దారుణం చోటుచేసుకుంది.
Arjun Suravaram
ఇటీవల కాలంలో అనేక రకమైన నేరాలు,ఘోరాలు జరుగుతున్నాయి. తరచూ ఏదో ఒక ప్రాంతంలో హత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధం, ఆర్థిక, భూ వివాదల కారణంగానే ఈ హత్యలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా జరిగే నేరాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. పరాయి వారి మోజులో పడి.. పచ్చటి సంసారాన్ని నిప్పులు పాలు చేసుకుంటున్నారు. పరాయి వారితో పది నిమిషాల పడక సుఖం కోసం ఆశ బడి.. భాగస్వామి చేతిలో బలవుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. వేరే వారితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను అతికిరాతకంగా ఓ భర్త హత్య చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన ఎస్తేరు (35)కు యడవూరుకు చెందిన ఎం.యోబుతో 18ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు ఉంది. యోబు తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక ఎస్తేరు గృహిణిగా ఉంటూ భర్త, పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేది. అంతేకాక భర్తకు వచ్చే సంపాదనతోనే ఆమె కుటుంబాన్ని నడిపిస్తూ ఉంది. కుమార్తె భవిష్యత్ గురించి ఆ దంపతులు ఎన్నో కలలు కనే వారు. అలా వారి కుటుంబం సజావుగా సాగుతోంది. ఇదే సమయంలో మనలో ఏర్పడే బుద్దే మన జీవితా గొప్ప స్థితి లేదా నాశనం చేస్తుంది.
అలానే ఎస్తేరుకు కలిగిన ఓ చెడు ఆలోచన.. ఆమె జీవితాన్నే నాశనం చేసింది. ఎస్తేరు ఇంటికి సమీపంలో నాగరాజు అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఈ క్రమంలో ఎస్తేరుకు నాగరాజుతో పరిచయం ఏర్పడింది. దీంతో వాళ్లు తరచు మాట్లాడుకునే వారు. అలా వారి పరిచయం ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా దారి తీసింది. ఇక చాలా రోజుల పాటు ఎస్తేరు, నాగరాజులు మూడో కంటికి తెలియకుండా ఈ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. కొన్ని రోజుల తరువాత వీరి విషయం ఎస్తేరు భర్త యోబుకు తెలిసింది. ఆమెకు గట్టి హెచ్చరిక కూడా చేశాడు. అలానే ఈ విషయమై తరచూ ఎస్తేరు, యోబు మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి వీరిద్దరు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే ఎస్తేరు ప్రవర్తనపై కోపోద్రిక్తుడైన యోబు ఆమెను గట్టిగా కొట్టడంతో కింద పడింది.
తలకు తీవ్ర గాయమై ఎస్తేర్ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు అమృతలూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు ప్రభాకర రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, మృతురాలి కుమార్తెకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. పోలీసులు సముదాయించినా వారు శాంతించలేదు.
అయితే భార్య చేసిందే తప్పు అయితే.. భర్తకు కూడా ఆవేశంతో హత్య చేసి.. ఆ ఇంటర్ చదివే బిడ్డను అనాథను చేశారు. ఆమె చేసిన తప్పును పరిష్కరించే దిశగా ఆలోచించకుండా.. ఆ భర్త కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇలా తల్లీదండ్రులు ఇద్దరు చేసిన తప్పుకు.. ఈ యువతి అనాథగా మిగిలింది. మొత్తంగా ఇలా వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు నిట్ట నిలువునా కూలిపోతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టే మార్గాలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.