ప్రేమించలేదనే కక్ష్యతో.. కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురిపై దారుణం!

Bengaluru Crime News: మంచి చదువు.. మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల పేరు నిలపాలని చూసిన ఓ యువతి జీవితంలో దారుణ సంఘటన జరిగింది.

Bengaluru Crime News: మంచి చదువు.. మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల పేరు నిలపాలని చూసిన ఓ యువతి జీవితంలో దారుణ సంఘటన జరిగింది.

దేశంలో ప్రతి నిత్యం మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్న పిల్లులు, వృద్దులు అని చూడకుండా కామాంధులు ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఒకదశలో మహిళలు పట్టపగలు కూడా ఒంటరిగా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. నిర్భయ, దిశ చట్టాలు వచ్చినప్పటికీ నేరా సంఖ్య తగ్గడం లేదు. ఆడవాళ్లను చూస్తే మృగాళ్లుగా మారిపోతున్నారు. మరోవైపు కొంతమంది యువకులు తామ ప్రేమను కాదన్న కారణంతో అన్యాయంగా అమ్మాయిలను చంపేస్తున్నారు. అలాంటి ఘగటనలో కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలో దారుణ సంఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో యువతిని  నరికి చంపారు. మృతురాలు హుబ్లీ-ధార్వాడ్ కార్పొరేషన్ సభ్యుడు నిరంజన్ హిరేమత్ కుమార్తె నేహా హిరేమత్ (24) పోలీసులు గుర్తించారు. నిందితుడు బెళగావి జిల్లా సౌదత్తికి చెందిన ఫయాజ్ గా గుర్తించారు. హుబ్లీ కాలేజ్ లో నేహ సీనియర్ ఫయాజ్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు ఫయాజ్, మృతురాలు నేహా హరేమత్ బీవీబీ కాలేజీలో చదువుతున్నారు. గత కొంత కాలంగా ఫయాజ్ తనను ప్రేమించాలని నేహ ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఆమె కాలేజ్ యాజమాన్యం, తల్లిదండ్రులకు చెప్పింది. ఇది మనసులో పెట్టుకొని తనని ప్రేమించని నేహా ఎవరికీ దక్కకూడదని నిర్ణయించుకొని గురువారం కాలేజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు.

నేహా హిరేమత్ తీవ్రంగా గాయ పడటంతో ఆమెను వెంటనే కీమ్స్ ఆస్పత్రికి తరలించారు. నేహా ని రక్షించడానికి ఎంత ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. నేహాపై దాడి చేసిన వెంటనే ఫయాజ్ అక్కడ నుంచి పారిపోయాడు. ప్రస్తతం నేహా కాలేజ్ లో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించి తర్వాత బంధువులకు అప్పగించారు. ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య సహా కాంగ్రెస్ నేతలు ఆస్పత్రిని సందర్శించి నేహా కుటుంబాన్ని ఓదార్చరు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఇంత దారుణానికి తెగబడ్డ ఫయాజ్ కి కఠిన శిక్ష విధించాలని విద్యార్థి సంఘాలు కాలేజ్ ఎదుట నిరసనలు చేపట్టారు.

Show comments