P Krishna
ఈ మద్య కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. దీంతో వారి పిల్లలు అనాధలుగా మిగిలిపోతున్నారు.
ఈ మద్య కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. దీంతో వారి పిల్లలు అనాధలుగా మిగిలిపోతున్నారు.
P Krishna
భారత దేశంలో వివాహబంధం ఎంతో గొప్పది.. వేద మంత్రాల సాక్షిగా, బంధు మిత్రులు సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంట ఒక్క ఏడాదిలోనే విడిపోతున్నారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా ఉన్నా.. చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి తారాస్థాయి చేరుకుంటున్నాయి. దీంతో దంపతులు కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, అక్రమ సంబంధాల కారణంగా మరికొంతమంది విడిపోతున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చి.. తన భర్త కనిపించడం లేదని డ్రామా ఆడిన భార్య ఆట కట్టించారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొటారు జిల్లా కేజీఎఫ్ కి చెందిన సునంద అనే మహిళ తన భర్త శంకర్ రెడ్డి కనిపించడం లేదని డిసెంబర్ 29న బేతమంగళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారున. రెండు రోజుల తర్వాత శంకర్ రెడ్డి బంధువు బాబు రెడ్డి మరో ఫిర్యాదు చేశారు. సునంద ఆమె ప్రియుడు వెంకటేశ్ ఇద్దరు కలిసి శంకర్ రెడ్డిని హత్య చేసినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గందరగోళంలో పడ్డారు. ఈ క్రమంలోనే జనవరి 6న వెంకటేశ్ పోలీసులకు పట్టుబడ్డాడు. సునంద, వెంకటేశ్ ని తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజాలు బయటపెట్టారు. దీంతో శంకర్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
కోలార్ జిల్లా కు చెందిన శంకర్ రెడ్డి, సునంద దంపతులు జీవనోపాధి కోసం బెంగుళూరు వైట్ ఫీల్డ్ సమీపంలో టీ కొట్టు పెట్టుకొని సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. వీరి ఇంటికి సమీపంలో వెంకటేశ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. టీ కొట్టుకు తరుచూ వస్తున్న వెంకటేశ్ తో సునంద పరిచయం పెంచుకుంది.. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం గురించి శంకర్ రెడ్డికి తెలియడంతో ఇద్దరని నిలదీశాడు. దీంతో తన భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది సునంద. డిసెంబర్ 27న వెంకటేశ్.. శంకర్ రెడ్డికి మాయ మాటలు చెప్పి నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లి జాక్ రాడ్డుతో తలపై కొట్టి చంపాడు. తర్వాత మృతదేహాన్ని బెంగుళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కాలువలో పడేశాడు. ఈ కేసులో వెంకటేశ్, సునంద ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు పోలీసులు.