కొడుకును కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించిన అమ్మ.. చివరికి..

Aswaraopeta Crime News: అమ్మను మించిన దైవం ఉన్నదా అని అంటారు. నవమాసాలు కనీ పెంచిన తల్లి తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది.. చివరికి ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడదని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి.

Aswaraopeta Crime News: అమ్మను మించిన దైవం ఉన్నదా అని అంటారు. నవమాసాలు కనీ పెంచిన తల్లి తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది.. చివరికి ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడదని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి.

నవమాసాలు మోసి కనీ పెంచే తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. దేవుడు తనకు బదులుగా తల్లిని ఈ లోకానికి పంపించారని పెద్దలు అంటారు. తన బిడ్డకు ఏ కష్టమొచ్చినా తన కంట నీరు చెమ్మగిల్లుతుంది. ప్రాణాపాయ స్థితిలో పిల్లలు ఉంటే తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కాపాడుకుంటుంది. అందుకే తల్లిని మించిన యోధుడు లేడు అని అంటారు. తాను చనిపోయే వరకు తన పిల్లల కోసమే ఆలోచిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. గోదావరిలో స్నానం చేయడానికి దిగిన కొడుకు అనుకోకుండా ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుంటే.. తల్లి ధైర్యం చేసి నీటిలో దూకింది.. చివరికి ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళితే..

దైవ దర్శనానికి వెళ్లిన తల్లీ కొడుకులను మృత్యువు వెంటాడింది. కొడుకు అనుకోకుండా నీటిలో మునిగి కొట్టుకుపోతుంటే.. ఏమీ ఆలోచించకుండా తల్లి నీటిలో దూకి కాపాడే ప్రయత్నం చేసింది.. కానీ ఆ ప్రయత్నంలో ఆమె కూడా తన ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు కొడుకు, భార్యతో ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తి కళ్లముందే ఇదంతా జరిగిపోవడంతో షాక్ కి గురయ్యాడు. ఈ విషాద ఘటన వేలేరుపాడు మండలం కట్కూర్ లో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేటకు చెందిన అల్లంశెట్టి నాగేశ్వరరావు తన బంధువులతో కలిసి ఆటోల్లో కట్కూరులోని ఉమారామలింగేశ్వర ఆలయానికి వెళ్లారు.

దైవ దర్శనం అనంతరం గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు. అల్లంశెట్టి తేజ శ్రీనివాస్ (22) ప్రమాద వశాత్తు నీటిలో మునిగి కొట్టుకుపోతున్నాడు.. అది గమనించిన తల్లి నాగమణి (45) కొడుకును కాపాడుకునేందుకు నీటిలోకి దూకి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. క్రమంగా నీటి ఎద్దడి పెరిగిపోవడంతో ఆమె కూడా నీటిలో మునిగిపోయి ఊపిరి ఆడక చనిపోయింది. కొంతమంది ఈత వచ్చిన వారు సైతం తల్లీకొడుకును కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. కళ్ల ఎదుటే భార్యా, కొడుకు కోట్టుకుపోవడం చూసి ఆ వ్యక్తి తల్లడిల్లిపోయాడు. నాగమణి, తేజ శ్రీనివాస్ మృతితో అశ్వరావుపేటలో తీవ్ర విషాదం నెలకొంది.

 

Show comments