P Krishna
American Crime News: ఇటీవల ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు.
American Crime News: ఇటీవల ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు.
P Krishna
ప్రపంచంలో మహిళలపై ప్రతి నిత్యం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా ఆడవాళ్లు కనిపిస్తే చాలు లైంగిక వేదింపులు, అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు కామాంధులు. ఒకదశలో మహిళలు ఒంటరిగా బయట తిరగాలంటే భయంతో వణికిపోతున్నారు. చిన్న, పెద్ద వయసు తేడా లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాలు కామంతో రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు వస్తున్నా.. కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఓ మహిళ మెడకు బెల్ట్ బిగించి.. ఈడ్చుకుంటూ వెళ్లి ఆమైప అత్యాచారానికి పాల్పపడిన ఘటన తీవ్ర సంచలనం రేపుతుంది. దీనికి సంబంధిచిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ దారుణ ఘటన న్యూయార్క్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మే 1న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బ్రాంక్స్ పరిసరాల్లో 45 ఏళ్ల వయసు ఉన్న మహిళ ఒంటరిగా నడుస్తూ ఇంటికి వెళ్తుంది. వెనుక నుంచి ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు.. కానీ ఆమె వెనక్కి తిరగకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. అంతలోనే ఆ వ్యక్తి బెల్ట్ తీసి ఆమె మెడకు బిగించి లాగాడు. దీంతో ఆ మహిళ కిందపడిపోయింది. కొద్ది సేపు ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది.. కొద్దిసేపటికి అపస్మారక స్థితికి చేరుకుంది. రెండు కార్ల మధ్యకు తీసుకువెళ్లిన ఆ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేసి అక్కడ నుంచి పారిపోయాడు.
ఈ ఘటన అనంతరం అక్కడికి వచ్చిన స్థానికులు ఆమె పరిస్థితి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఒంటరిగా నడిరోడ్డుపై వెళ్తున్న మహిళలకు రక్షణ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు పాల్పపడ్డ నిందితుడిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
New York City. This looks like it came straight out of a movie. Horrible. pic.twitter.com/b2GS9CWWst
— Ian Miles Cheong (@stillgray) May 9, 2024