iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి చేసుకుందని కిరాతకం! మరీ ఇంత ఘోరమా?

తమిళనాడులోొ దారుణం చోటు చేసుకుంది. ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకుందని కిరాతకానికి పాల్పడ్డారు. పెళ్లైన మూడు రోజులే ఇలా చేయడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

తమిళనాడులోొ దారుణం చోటు చేసుకుంది. ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకుందని కిరాతకానికి పాల్పడ్డారు. పెళ్లైన మూడు రోజులే ఇలా చేయడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

ప్రేమించి పెళ్లి చేసుకుందని కిరాతకం! మరీ ఇంత ఘోరమా?

ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు మారిసెల్వం, యువతి పేరు కార్తిక. గత రెండేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఇక జీవితాంతం కలిసి బతకాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, యువతి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. అయినా సరే ఈ జంట పెద్దలను ఎదురించి మూడు రోజుల కిందట ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే.. తాజాగా ఈ నవ దంపతులు శవాలై కనిపించారు. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు తూత్తుకూడి జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన మారిసెల్వం, కార్తికలు గత రెండేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. అప్పటి నుంచి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఇక జీవితాంతం కలిసి ఉండేందుకు పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. ఇదే విషయాన్ని కార్తిక తన కుటుంబ సభ్యులకు వివరించింది. కానీ, మారిసెల్వం తక్కువ కులానికి చెందినవాడు కావడంతో యువతి కుటుంబ సభ్యులు అతడితో పెళ్లికి నిరాకరించారు. ఆ తర్వాత యువతి జరిగిందంతా ప్రియుడికి చెప్పింది. ఇక లాభం లేదనుకుని ఈ ప్రేమికులు మూడు రోజుల కిందట పెద్దలను ఎదురించి ఓ గుడిలో వివాహం చేసుుకున్నారు. ఇదే విషయం కార్తిక తల్లిదండ్రులకు తెలియడంతో ఒంటి కాలుపై లేచి ఆగ్రహంతో ఊగిపోయారు.

ఇక కట్ చేస్తే.. తాజాగా ఈ నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వీరిని చూసి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే యువతి ఒంటిపై 12 కత్తి పోట్లు ఉండగా, యువకుడి శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నవ దంపతులను యువతి కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş