iDreamPost
android-app
ios-app

రూ. 25 కోట్ల ఆస్తి కబ్జా.. నన్ను, నా బిడ్డను చంపేస్తామంటున్నారు : నటి గౌతమి

  • Published Sep 13, 2023 | 1:26 PM Updated Updated Sep 13, 2023 | 1:26 PM
  • Published Sep 13, 2023 | 1:26 PMUpdated Sep 13, 2023 | 1:26 PM
రూ. 25 కోట్ల ఆస్తి కబ్జా.. నన్ను, నా బిడ్డను చంపేస్తామంటున్నారు : నటి గౌతమి

‘ఓహో లైలా ఓ చారు శీల కోపమేలా, మనకేలా బాల మందార మాల మాపటేలా’ అంటూ చైతన్య మూవీలో నాగార్జునతో టీజింగ్ చేయించుకున్న నటి గౌతమి. తన చబ్బీ నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన గౌతమి దక్షిణాది పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. కృష్ణ, వెంకటేష్, నాగ్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, సుమన్, జగపతి బాబు, రజనీ, కమల్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ నటులతో నటించింది. ఎన్నో హిట్ సినిమాల్లో కనిపించింది. 1998లో సందీప్ భాటియా అనే బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. అయితే వీరి కాపురం మూణాళ్ల ముచ్చటగానే మిగిలింది. 1999లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీరికి కుమార్తె సుబ్బలక్ష్మి ఉంది. అదే సమయంలో గౌతమి క్యాన్సర్‌తో బాధపడ్డారు. తన కో నటుడు, కోలీవుడ్ టాప్ స్టార్ కమల్ హాసన్‌ ఆమెకు సాయం అందించాడు. అప్పటి నుండి వీరు రిలేషన్‌లో ఉన్నారు. పుష్కరకాలం వీరి బంధం కొనసాగి..2016లో విడిపోయారు.

ఇటీవల మళ్లీ సినిమాల్లో కనిపిస్తున్నారు గౌతమి. శాకుంతలం, అన్నీ మంచి శకునములే చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం స్కంద సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో ఆమెకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె కొన్ని ఆస్తులను అమ్మేయాలనుకుని, అలగప్పన్ అనే ఏజెంట్‌కు అప్పగించారు. ఆమె ఆస్థిపై కన్నేసిన అలగప్పన్ ఫోర్జరీ, సంతకాలు, నకిలీ పత్రాలు సృష్టించారు. దీంతో  గౌతమి పోలీసులను ఆశ్రయించారు. శ్రీపెరంబుదూర్‌లో ఉన్న రూ. 25 కోట్ల విలువైన ఆస్థిని స్థిరాస్థి వ్యాపారి అలగప్పన్ కబ్జా చేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే రాజకీయ అండ చూపించి, తనను, తన కుమార్తెను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఆస్తిని తనకు తిరిగి ఇప్పించాలని కోరారు. ఆమె నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు..దర్యాప్తు చేపడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet