తాగిన మైకంలో యువకుడి చిలిపి చేష్టలు! బతుకమ్మ ఆడుతున్న మహిళలపై..!

ఇటీవల కొంతమంది మద్యం మత్తులు అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతూ.. ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి.

ఇటీవల కొంతమంది మద్యం మత్తులు అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతూ.. ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి.

మారిన కాలానికి అనుగుణంగా ఈ రోజుల్లో ఇంటర్ పోరగాళ్ల నుంచి వృద్ధుల వరకూ అందరూ మద్యానికి బానిసయ్యారు. ఇక కొందరు యువకులు మాత్రం మద్యం తాగడం అనేది ఇప్పటి ట్రెండ్ అంటూ కాలర్ ఎగరేసి తిరుగుతున్నారు. అంతటితో సరిపెడతారా అంటే అదీ లేదు. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ చేయరాని పనులు చేస్తుంటారు. అయితే ఇటీవల దసరా పండగ వేళ ఇలాగే మద్యం సేవించిన ఓ యువకుడు.. తాగిన మైకంలో మహిళలతో చిలిపి చేష్టలకు కాలు దువ్వాడు. ఏకంగా బుతుకమ్మ ఆడుతున్న మహిళల వద్దకు వెళ్లి చేయరాని పని చేశాడు. ఈ ఘటనపై సీరియస్ అయిన మహిళలు ఏకంగా అతడి తీరు నచ్చక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

బాధితుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో దసరా పండగ నేపథ్యంలో ఊరిలోని మహిళలు అందరూ కలిసి బతుకమ్మ ఆడారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు బైక్ పై బీర్ బాటిల్ తాగుకుంటూ వచ్చాడు. ఇక తాగుతున్న బీర్ ను బతుకమ్మ ఆడుతున్న ఓ మహిళలపై చల్లాడు. దీంతో వెంటనే స్పందించిన ఓ మహిళ.. అతడితో వాగ్వాదానికి దిగాడు. వెంటనే ఆమె భర్త అక్కడికి వచ్చి ఆ యువకుడితో గొడవ చేశాడు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు.. ఈ మహిళ, ఆమె భర్తతో పాటు మరొకరిపై దాడి చేయడంతో వారు గాయపడ్డారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించారు.

అనంతరం బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. పోలీసులు ఇంతకు వరకు నిందితుడిని పట్టుకోలేదని బాధితులు వాపోయారు. మాకు ఇక్కడ న్యాయం జరగకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన ఆ యువకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments