Krishna Kowshik
అతడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. తన సేవలు ప్రజలకు అంకితం ఇవ్వాల్సింది కానీ.. మహిళలకు మాత్రమే అనే బోర్డు పెట్టుకున్నట్లు ఉన్నాడు. తనకు నచ్చిన మహిళపై కన్నేయడం.. ఆ తర్వాత..
అతడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. తన సేవలు ప్రజలకు అంకితం ఇవ్వాల్సింది కానీ.. మహిళలకు మాత్రమే అనే బోర్డు పెట్టుకున్నట్లు ఉన్నాడు. తనకు నచ్చిన మహిళపై కన్నేయడం.. ఆ తర్వాత..
Krishna Kowshik
కర్ణాటకలో హాసన్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ సెక్స్ స్కాండిల్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. అతడు చేసిన అరాచకాలు బయటపడటంతో జెడీఎస్ అతడ్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇప్పుడు రాష్ట్రాన్ని ఈ అంశమే కుదిపేస్తుంది. ఈ సమయంలో మరో ప్రభుత్వ ఉద్యోగి రాసలీలలు బయటకు వచ్చాయి. అతడు గ్రామ పంచాయతీలో పని చేస్తున్నాడు. ప్రజలకు సేవలందించాల్సిన ఆ గవర్నమెంట్ ఎంప్లాయి.. కేవలం మహిళలకు మాత్రమే సర్వీసు అందిస్తున్నాడు. రేవణ్ణను మించిపోయి.. మహిళలను బెదిరించి, లోబర్చుకుని కామ వాంఛ తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఇతగాడి రాసలీలల పర్వం వీడియోల రూపంలో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని కేజీఎఫ్ తాలూకాలోని రామసాగర గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్‌గా అర్జున్ హరికృష్ణ (36) విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ ముసుగులో మహిళలతో రాసలీలలు సాగిస్తున్నాడు. ఈ కామ క్రీడలు బయటకు వచ్చాయి. తోటి ఉద్యోగినితో ముద్దులు ముచ్చట్లతో తేలిన వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. ఒక గ్రామ పంచాయతీలో ఉద్యోగులు ఆఫీసు పనివేళల్లో బహిరంగంగా ముద్దులు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకోగా.. ఈ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఇద్దరిపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. వర్క్ ప్లేసును ఇలా తమ కామ క్రీడలకు వినియోగించుకుంటున్నారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. వృత్తి పట్ల నిబద్ధత, గౌరవంగా ఉండాల్సిన ఇద్దరు ఉద్యోగులు చేయాల్సిన పనేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై గ్రామస్థుల చొరవతో మహిళా ఉద్యోగిని బయటకు వచ్చింది.
అర్జున్ పై కేసు నమోదు చేసింది. తనను బలవంతంగా లోబర్చుకున్నాడని పేర్కొంది. బాధితురాలు మాట్లాడుతూ పంచాయతీలో ఉద్యోగం పర్మినెంట్ చేయడంతో పాటు, భర్తకు కూడా ఉద్యోగం కల్పిస్తానని తనకు ప్రలోభాలు పెట్టేవాడని తెలిపింది. తన భర్తకు వాటర్‌మ్యాన్ ఉద్యోగం, ప్రభుత్వ గృహం ఉచితంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చి హరికృష్ణ తనను లొంగదీసుకున్నాడని, తన ఆఫర్ నిరాకరిస్తే ఉద్యోగాన్ని తొలగిస్తానని బెదిరించేవాడని తెలిపింది. అలా తనను వినియోగించుకున్నాడని, తనతో సన్నిహితంగా గడిపిన సమయంలో ఫోటోలు తీసి.. వాటిలో బ్లాక్ మెయిల్ చేసేవాడని బాధితురాలు పేర్కొంది. హరికృష్ణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ సభ్యులు పిడిఓకు విన్నవించారు. బాధితురాలిని ఒప్పించి ఆమెతో బేత మంగల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. బాధితురాలి ఫిర్యాదుతో బిల్ కలెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా కాదు.. ఇలా అనేక మంది మహిళలను బెదిరించి, భయపెట్టి లోబర్చుకుని, తన కామ వాంఛను తీర్చుకున్నాడని పోలీసలు తేల్చారు.