iDreamPost
android-app
ios-app

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఒంగోలు 2 టౌన్ ఎస్ఐ

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఒంగోలు 2 టౌన్ ఎస్ఐ

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులు గలీజ్ పనులకు తెర లేపుతున్నారు. అచ్చం ఇలాగే ఒంగోలు టూ టౌన్ ఎస్ఐ రూ. 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అనంతరం న్యాయస్థానం నిందితుడిగా 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి ప్రకాశం జిల్లా, ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి తన వాహనాన్ని మరొక వ్యక్తికి ఇవ్వగా.. అతడు ఆ వాహహనానికి నకిలీ పత్రాలు సృష్టించాడు.

దీంతో మోసపోయానని గ్రహించిన ఆ బాధితుడు వెంటనే ఒంగోలు 2 టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై ఎస్ఐ షేక్ మహబూబ్ బాషా స్పందించి.. నీ సమస్య పరిష్కరించాలంటే నాకు రూ.90,000 లంచం ఇవ్వాలని కోరాడు. దీనికి సరే అన్న బాధితుడు దిక్కుతోచని స్థితిలో ముందు 10,000 రూపాయలు అడ్వాన్సుగా తీసుకొని మిగతా డబ్బు కోసం ఎస్ఐ మహబూబ్ బాషా డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు చేసేదేం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు బాధితుడు ఎస్ఐకి డబ్బులు చెల్లించేలా ప్లాన్ గీశారు.

ఈ క్రమంలోనే ఆ అధికారులు దాడులు చేసి ఎస్ఐ షేక్ మహబూబ్ బాషాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టగా న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం టౌన్ పరిధిలోని భారతి నగర్ లో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు ఇటీవల తన ఖాళీ నివాస స్థలం సంబంధించిన పన్నును ప్రాసెస్ చేయడానికి శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ గౌరి శంకరరావును కలిసి సమస్యను వివరించాడు.

కార్పోరేషన్ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ స్పందించి.. రూ.20,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఆ కార్పోరేషన్ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ బాధితుడి నుంచి రూ. 20,000 లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత డీజీపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ 14400 నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: బంధువులను కలిసేందుకు భర్తతో వెళ్లింది.. పాపం, అతని కళ్లెదుటే..!