iDreamPost
android-app
ios-app

బంధువులను కలిసేందుకు భర్తతో వెళ్లింది.. పాపం, అతని కళ్లెదుటే..!

  • Published Aug 01, 2023 | 5:23 PM Updated Updated Aug 01, 2023 | 5:23 PM
  • Published Aug 01, 2023 | 5:23 PMUpdated Aug 01, 2023 | 5:23 PM
బంధువులను కలిసేందుకు భర్తతో వెళ్లింది.. పాపం, అతని కళ్లెదుటే..!

ఏపీకి చెందిన ఈ మహిళ పేరు అపర్ణ, వయసు 26 ఏళ్లు. ఈమెకు గతంలో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. అపర్ణ తన బంధువులను చూడటానికి తాజాగా భర్తతో కలిసి బయలు దేరింది. కానీ, కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఆమె భర్త కళ్లముందే ఇలా జరగడంతో గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అపర్ణ కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన దాసరి సత్తిబాబు-అపర్ణ దంపతులు. వీళ్లు ఉపాధి నిమిత్తం 5 ఏళ్ల నుంచి అనకాపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. భర్త స్థానికంగా ఓ షాపింగ్ మాల్ లో క్యాషియర్ గా పని చేస్తుండగా అపర్ణ ఇంట్లోనే ఉండేది. అలా వీరి సంసారం సంతోషంగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. సోమవారం అపర్ణ వారి బంధువులను కలవడానికి భర్తతో కలిసి వెళ్లింది. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న స్కూటీ నాతయ్యపాలెం సమీస్తుంచే క్రమంలో వీరి వాహనాన్ని వెనకాల నుంచి లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అపర్ణ స్కూటీపై నుంచి ఎగిరి కిందపడిపోయింది.

దీంతో తీవ్ర రక్త స్రావమై ఆ మహిళ.. భర్త కళ్లెదుటే అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘోరాన్ని చూసి భర్త సత్తిబాబు గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇక స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత గాయపడిన మృతురాలి భర్త సత్తిబాబును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అపర్ణ మరణవార్త తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: నిద్రపోతున్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom