Dharani
Dharani
ఈమధ్య కాలంలో కిరాణ దుకాణాల్లో కొనడం బాగా తగ్గిపోయింది. జీతం పడిందంటే చాలు.. వెంటనే డీమార్ట్, లేదంటే దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లి.. సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇక పిల్లలకు ఇలా సూపర్ మార్కెట్‌కు వెళ్లడం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాల్ అంతా తిరుగుతూ.. తమకు నచ్చినవి చేత పట్టుకుని రావచ్చు. మరీ ముఖ్యంగా సూపర్ మార్కెట్‌లలో వరుసగా ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేసి ఐసీక్రీమ్, చాక్లెట్స్, కూల్‌డ్రింక్స్ వంటి వాటిని కస్టమర్లకు కనిపించేలా ఎదురుగా ఉంచుతారు.
ఇక వాటిని చూసిన పిల్లలు ఆగుతారా.. లేదు.. వెంటనే ఫ్రిడ్జ్ ఒపెన్ చేసి.. తమకు కావాల్సిన తీసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్నారి కూడా అదే పని చేసింది. అలా ఫ్రిడ్జ్ తెరవడమే ఆ బాలిక పాలిట శాపమయ్యింది. అంతవరకు ఆడుతూ, పాడుతూ సంతోంగా ఉన్న బిడ్డ.. ఒక్కసారిగా కుప్ప కూలింది. ఫ్రిడ్జ్ ఒపెన్ చేయబోతే షాక్ కొట్టి.. అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ నాలుగేళ్ల తన కుమార్తె రుషితను తీసుకుని సమీపంలోని సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. అతడు తన పనిలో బిజీగా ఉండగా.. చిన్నారి రుషిత చాక్లెట్ కోసం ఎదురుగా ఉన్న ఫ్రిడ్జ్ ఒపెన్ చేసింది. అంతే ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి రుషిత అక్కడికక్కడే మృతి చెందింది. ఫ్రిడ్జ్ డోర్ తీయగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందిందని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
సూపర్ మార్కెట్‌లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతే షాక్ కొట్టి చిన్నారి మృతి
నిజామాబాద్ – నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి N సూపర్ మార్కెట్ వెళ్ళగా ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి రుషిత ప్రాణాలు కోల్పోయింది.
చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్… pic.twitter.com/XAgbB8NdoO
— Telugu Scribe (@TeluguScribe) October 2, 2023