Uppula Naresh
Uppula Naresh
ఈ రోజుల్లో కొంతమంది ఒళ్లు వంచి పనులు చేయకుండా ఈజీ మనీ కోసం చేయని ప్రయత్నాలు లేవనుకోండి. ఇలా ఎంతో మంది వ్యక్తులు అడ్డగోలుగా ఈజీ మనీ కోసం అలవాటు పడి అనేక దందాలు చేస్తూ చివరికి పోలీసులకు చిక్కుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భార్యాభర్తలు గలీజ్ దందాకు తెర లేపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు షాక్ గురవుతున్నారు. ఈ వయసులో కూడా ఇవేం పనులు అంటూ ప్రశ్నించారు. ఇంతకు ఈ దంపతులు చేసిన ఆ దందా ఏంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని మౌలాలీ ఎంజే కాలనీలో సుశీల్ కుమార్ మిశ్రా-నేహా చింతమన్ రావ్ భగవత్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు మల్కాజ్ గిరిలో ఓ ఎంటర్ ప్రైజెస్ పేరుతో మెడికల్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. ఈ నిర్వాహకులు ఎన్టీపీఎస్ 1, 2 లైసెన్స్ కూడా తీసుకున్నారు. కానీ, దాని గడువు గతేడాదితోనే ముగిసిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ దంపతులు మెడికల్ షాపు ముసుగులో గలీజ్ దందాకు తెర లేపారు. ఫెంటనైల్ సిట్రేట్ ఇంజెక్షన్ లు సరఫరా చేస్తున్నారు. అలాంటి ఇంజక్షన్లు దాదాపుగా 3265 (9.33 లీటర్లు) వరకు అక్రమంగా నిల్వ ఉంచి విక్రయించారు.
ఇక ఈ విషయం చివరికి తెలంగాణ స్టేట్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో దృష్టికి వెళ్లింది. దీంతో ఆ అధికారులు వెంటనే స్పందించి ఆ దంపతులు నిర్వహిస్తున్న ఆ మెడికల్ షాపుపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొన్ని ఔషదాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. వీళ్లు ముంబైకి చెందిన ఓ ఔషదాల తయారీ సంస్థలో పని చేసే రీజనల్ సేల్స్ మేనేజర్ సలహా మేరకు పాత లైసెన్స్ ను ఫోర్జరీ చేసి రెన్యువల్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తిని సైతం అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. భార్య కుటుంబం మొత్తాన్ని చంపేశాడు!