P Krishna
P Krishna
ఇటీవల విమాన ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం, పక్షులు ఢీ కొట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమాయాన శాఖ అధికారులు అంటున్నారు. పైలెట్లు సమయస్ఫూర్తితో ముందుగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి కొన్నిసార్లు ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియాలో ఓ తేలికపాటి విమానం కుప్పకూలి నలుగురు దుర్మరణం పాలయ్యారు. కాన్ బెర్రా నగరం నుంచి బయలు దేరిన మినీ విమానం క్విన్ బెయిన్ పట్టణ సమీపంలో హఠాత్తుగా కూలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదం వశాత్తు మంటలు వ్యాపించడంతో కుప్పకూలిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు.
విమానంలో పైలెట్, ముగ్గురు పిల్లలు మరణించినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. సిర్రాస్ ఎస్ఆర్ 22 మినీ ప్లెయిన్ కాన్ బెర్రా నుంచి శుక్రవారం మధ్యాహ్నం బయలు దేరి సిడ్నీ కి కొద్ది దూరంలో ఉన్న క్విన్ బెయాన్ పట్టణ సమీపంలో కూప్పకూలిపోయిందని ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు. కులీపోయిన వెంటనే మంటల్లో చిక్కుకొని పైలెట్ సహ ముగ్గురు చిన్నారు కాలి బూడిదయ్యారని విచారం వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాదంపై ఆస్ట్రేలియన్ ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. కాగా, విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.