Uppula Naresh
పైన ఫొటొలో కనిపిస్తున్న ఈ యువతి పేరు జీవిత. ఆర్మీ ఆఫీసర్ ను ప్రేమిస్తున్నానని నటించి అతనితో చాలా రోజులు తిరిగింది. కట్ చేస్తే.. కొన్నాళ్లకి ప్లేట్ ఫిరాయించి ఊహించని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటొలో కనిపిస్తున్న ఈ యువతి పేరు జీవిత. ఆర్మీ ఆఫీసర్ ను ప్రేమిస్తున్నానని నటించి అతనితో చాలా రోజులు తిరిగింది. కట్ చేస్తే.. కొన్నాళ్లకి ప్లేట్ ఫిరాయించి ఊహించని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
Uppula Naresh
ప్రేమ.. దీన్నే ఆయుధంగా మలుచుకుంటున్న కొందరు అమ్మాయిలు దారుణాలకు పాల్పడుతున్నారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని యువకులను హనీట్రాప్ లోకి దింపుతున్నారు. ఇక తమ అందచందాలతో యువకులను తమ వైపుకు తిప్పుకుని వారిని పీక్స్ కు తీసుకెళ్తారు. అందమైన ఫొటోలను వారికి పంపుతూ వారిని ఊహా లోకంలో తిరిగేలా చేస్తారు. అనుకున్నట్లే పక్కా ప్లాన్ తో యువతులు యువకులను ఓ చోటుకు రప్పించి వారితో చేయాల్సినవి అన్నీ చేస్తారు. ఈ క్రమంలోనే ఆ కిలాడీ లేడీలు వారితో సన్నిహితంగా కలిసున్న ఫోటోలను తీసుకుని వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ చివరికి అందనికాడికి దోచుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాగే ఓ యువతి ఏకంగా ఓ ఆర్మీ పోలీస్ ఆఫీసర్ ను తన ముగ్గులోకి దింపింది. ప్రేమిస్తున్నానని నటించి అందినకాడికి దోచుకుని ఇంకా కావాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగింది. ఇక ఆ యువతి వేధింపులను తట్టుకోలేని ఆ ఆఫీసర్ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. సందేశ్ అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నాడు. ఇతనికి గతంతో యశోధ అనే మహిళతో వివాహం జరిగింది. ఇదిలా ఉంటే.. ఉద్యోగ రిత్యా సందేశ్ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇతనికి కర్ణాటకలోని కొడుకు ప్రాంతానికి చెందిన జీవిత అనే యువతి సందేశ్ తో పరిచయం పెంచుకుంది. ఇక రాను రాను ఆ అమ్మాయి అతనికి మరింత దగ్గరైంది. తన అంద చందాలతో జీవిత మొత్తానికి సందేశ్ ను ముగ్గులోకి దింపేసుకుంది. ప్రేమిస్తున్నానని నటించి సందేశ్ ను అన్ని రకాలు వాడుకుంది. నకిలీ ప్రేమను ఒలకబోస్తూ అప్పడప్పుడు అతనితో సన్నిహితంగా ఫోటోలు కూడా దిగింది.
దీంతో పాటు అవసరమైనప్పుడల్లా సందేశ్ వద్ద బాగానే డబ్బు కూడా లాగేసుకునేది. అయితే కొన్ని రోజుల తర్వాత సందేశ్ తో తీసుకున్న ఫోటోలను ఆ యువతి తన స్నేహితులకు పంపింది. ఈ ఫోటోల సాయంతో ఆ యువతి తన స్నేహితులతో కలిసి సందేశ్ తో బ్లాక్ మెయిల్ కు దిగింది. కోరినంతా డబ్బులు ఇవ్వాలని, లేకుంటే నీ పరువు తీస్తానని వేధింపులకు పాల్పడింది. అలా ఎన్నో దఫాలుగా ఆ యువతి సందేశ్ వద్ద సుమారు రూ.20 లక్షల వరకు దోచుకుంది. ఇంతటితో సరిపెట్టని ఈ కిలాడీ.. అతని వద్ద ఉన్నఆస్తిపత్రాలతో పాటు కారు కూడా లాగేసుకున్నట్లు సమాచారం. ఇంతే కాకుండా రైటర్మెంట్ తర్వాత వచ్చే మొత్తం నగదును కూడా ఆమెకే చెందేలా టార్చర్ పెట్టింది.
ఇకపోతే.. ఇటీవల జీవిత ఖచ్చితంగా రూ.50 లక్షలు ఇవ్వాలని వేధింపులకు పాల్పడడంతో సందేశ్ తట్టుకోలేకపోయాడు. చేసేదేం లేక ఇటీవల సందేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత జరిగింది తెలుసుకుని మృతుని భార్య షాక్ గురైంది. అనంతరం యువతి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.