iDreamPost
android-app
ios-app

2 నెలల తర్వాత OTT లోకి కామిడి ఎంటర్టైనర్.. ఎక్కడంటే ?

  • Published Jun 04, 2025 | 10:50 AM Updated Updated Jun 04, 2025 | 10:50 AM

కొన్ని సినిమాలు థియేటర్ లో ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియదు. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్నైతే ఓటిటి లోకి వచ్చిన తర్వాతే ఇలాంటి సినిమా కూడా ఉందా అని తెలుస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఈ కోవకు చెందిందే.

కొన్ని సినిమాలు థియేటర్ లో ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియదు. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్నైతే ఓటిటి లోకి వచ్చిన తర్వాతే ఇలాంటి సినిమా కూడా ఉందా అని తెలుస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఈ కోవకు చెందిందే.

  • Published Jun 04, 2025 | 10:50 AMUpdated Jun 04, 2025 | 10:50 AM
2 నెలల తర్వాత OTT లోకి కామిడి ఎంటర్టైనర్.. ఎక్కడంటే ?

కొన్ని సినిమాలు థియేటర్ లో ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియదు. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్నైతే ఓటిటి లోకి వచ్చిన తర్వాతే ఇలాంటి సినిమా కూడా ఉందా అని తెలుస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఈ కోవకు చెందిందే. మార్చి చివరి వారంలో సప్తగిరి నటించిన ఓ సినిమా థియేటర్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేదు. ఈ సినిమాలో క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి హీరోగా , ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు ఈ మూవీ ఓటిటి లో అడుగుపెట్టనుంది. అసలు ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అని తెలుసుకునేముందు. ఈ సినిమా కథేంటో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రసాద్ కు 36 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాలేదనే టెన్షన్ లో ఉంటాడు. అతని తండ్రి ఏమో రెండు కోట్ల కట్నం ఇస్తే కానీ పెళ్లి చేయనని భీష్మించుకుని కూర్చుంటాడు. కానీ చివరకు ప్రసాద్ ఇవన్నీ కాదని పైసా కట్నం కూడా లేకుండా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక అక్కడ మొదలవుతుంది అసలు కథ. అతను ఫారెన్ లో ఉంటాడు అనుకుని పెళ్లి చేసుకున్న అతని భార్య , ఆమె కుటుంబం ప్రసాద్ తో ఎలా చెడుగుడు ఆడారు అనేదే ఈ మూవీ. ఈ సినిమా పేరు పెళ్లి కానీ ప్రసాద్

ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓ మంచి కామిడి ఎంటర్టైనర్ , సప్తగిరి కామిడి టైమింగ్ ఎంజాయ్ చేయాలి అనుకునేవారు ఈ సినిమా చూసేయొచ్చు. ఇక ఓటిటి లో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom