iDreamPost
android-app
ios-app

బన్నీ వాస్ , ప్రియదర్శి నుంచి ‘మిత్ర మండలి’

  • Published Jun 04, 2025 | 12:30 PM Updated Updated Jun 04, 2025 | 12:30 PM

బలగం మూవీ ప్రియదర్శి గ్రాఫ్ ను సెట్ చేసింది. ఈ సినిమాతో ప్రియదర్శి ప్రేక్షకులలో స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ హీరోకు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ దొరికేసింది.

బలగం మూవీ ప్రియదర్శి గ్రాఫ్ ను సెట్ చేసింది. ఈ సినిమాతో ప్రియదర్శి ప్రేక్షకులలో స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ హీరోకు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ దొరికేసింది.

  • Published Jun 04, 2025 | 12:30 PMUpdated Jun 04, 2025 | 12:30 PM
బన్నీ వాస్ , ప్రియదర్శి నుంచి ‘మిత్ర మండలి’

బలగం మూవీ ప్రియదర్శి గ్రాఫ్ ను సెట్ చేసింది. ఈ సినిమాతో ప్రియదర్శి ప్రేక్షకులలో స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ప్రియదర్శి హీరోగా వచ్చిన డార్లింగ్ సినిమా నిరాశపరిస్తే.. ఆ తర్వాత వచ్చిన కోర్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన సారంగపాణి జాతకం అంతగా టాక్ సంపాదించుకోలేకపోయింది. ఇక హిట్ ప్లాప్ తో సమానంగా సాగిపోతున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు ఈ హీరోకు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ దొరికేసింది.

నిర్మాత బన్నీ వాస్ తన పేరు మీద సొంతంగా బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా ఓ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్నారు. దీనికి “మిత్ర మండలి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక దీనిలో బన్నీ వాస్ తో పాటు హాయ్ నాన్న ఫేమ్ ఐరా ఎంటర్ టైన్మెంట్స్ , సప్త అశ్వ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వాములుగా ఉండబోతున్నారట. ఈ సినిమా టైటిల్ ను బట్టి గమనిస్తే ఇదేదో ఫ్రెండ్స్ బ్యాక్డ్రాప్ లో సాగే కంప్లీట్ కామిడి ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. ఈ సినిమాకు ఎస్ విజయేంద్రని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారట.

జూన్ 6న ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఇక ప్రియదర్శికి ఈ సినిమా ఏ విధంగా కలిసి వస్తుందో.. ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ సినిమా కనుక హిట్ అయితే అతని మార్కెట్ కూడా పెరుగుతుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.