iDreamPost
android-app
ios-app

వీటికోసమైనా కమల్ ‘థగ్ లైఫ్’ చూడాల్సిందే

  • Published Jun 04, 2025 | 2:10 PM Updated Updated Jun 04, 2025 | 2:10 PM

ఈ సినిమా ప్రస్తుతం ఎలాంటి వివాదంలో చిక్కుకుందో తెలియనిది కాదు. రేపు మూవీ రిలీజ్ పెట్టుకుని కూడా ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉందన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అన్న టెన్షన్.. ఇటు అభిమానులతో పాటు అటు దర్శక నిర్మాతలకు కూడా ఉంది. అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు చెప్పుకోబోయే వాటికోసమైన మూవీ చూడాల్సిందే.

ఈ సినిమా ప్రస్తుతం ఎలాంటి వివాదంలో చిక్కుకుందో తెలియనిది కాదు. రేపు మూవీ రిలీజ్ పెట్టుకుని కూడా ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉందన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అన్న టెన్షన్.. ఇటు అభిమానులతో పాటు అటు దర్శక నిర్మాతలకు కూడా ఉంది. అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు చెప్పుకోబోయే వాటికోసమైన మూవీ చూడాల్సిందే.

  • Published Jun 04, 2025 | 2:10 PMUpdated Jun 04, 2025 | 2:10 PM
వీటికోసమైనా కమల్ ‘థగ్ లైఫ్’ చూడాల్సిందే

కమల్ హాసన్ , మణిరత్నం కాంబినేషన్ లో మూవీ వస్తుందని అనౌన్స్ చేసినప్పుడు.. అంతా ఈ సినిమా కోసం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యారు. మూవీ టీజర్ , ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ చేసాక సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అలాగే అటు ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేశారు. ఇవన్నీ ఒకెత్తయితే.. కమల్ చెప్పిన ఓ చిన్న మాట చిలికి చిలికి గాలి వాన అవ్వడం. అది అతనికి సుమారు 20 కోట్ల నష్టం తెచ్చి పెట్టడం మరొక ఎత్తు. ఈ సినిమా ప్రస్తుతం ఎలాంటి వివాదంలో చిక్కుకుందో తెలియనిది కాదు. రేపు మూవీ రిలీజ్ పెట్టుకుని కూడా ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉందన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అన్న టెన్షన్.. ఇటు అభిమానులతో పాటు అటు దర్శక నిర్మాతలకు కూడా ఉంది.

అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు చెప్పుకోబోయే వాటికోసమైన మూవీ చూడాల్సిందే. ఈ సినిమాకు మెయిన్ పాయింట్ కమల్ రాసిన కథే అని ఆల్రెడీ మణిరత్నం చెప్పారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాయగన్ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. థగ్ లైఫ్ దీనికి మించి ఉంటుందని కమల్ హాసన్ చెప్పారు. సో దానికంటే ఈ సినిమా బావుంటుందా అనేది చూడాలి. ఇంకో ఇంకో రీజన్ మణిరత్నం మేకింగ్.. మణిరత్నం నటీ నటులను స్క్రీన్ మీద చూపించే తీరు.. అతని ఫ్రేమింగ్స్ , అతని విజన్ వీటి అన్నిటికి ఆడియన్స్ ఎప్పుడు ఫిదా అవుతూనే ఉంటారు. సో దానికోసం అయినా ఈ మూవీ చూడాల్సిందే.

ఇక ఆ తర్వాత రీజన్ శింబు , త్రిష. శింబు హీరోగా ఏ రేంజ్ లో బిజీగా ఉంటున్నాడో తెలియనిది కాదు. ఇలాంటి క్యామియోలను అతను అసలు ఒప్పుకోవడం లేదు. కానీ ఈ సినిమాలో కేవలం కమల్ కోసమే ఆయన నటించారు. వీరిద్దరి మధ్య ఎలాని సీన్స్ ఉండబోతున్నాయా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక త్రిష విషయానికొస్తే.. త్రిష తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని కొత్త పాత్రను పోషిస్తున్నారట. ట్రైలర్ చూడనంతవరకు శింబుకి జోడిగా త్రిష ఉందని అనుకున్నారు. కానీ ట్రైలర్ లో కమల్ పక్కన త్రిషను చూసాక అంతా షాక్ అయ్యారు. సో ట్విస్ట్ కోసమైనా మూవీ చూడాల్సిందే. ఇక రేపు థగ్ లైఫ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibom