Uppula Naresh
పైన ఫోటోలో కనిపిస్తున్న బాలి పేరు ప్రగ్యా. స్థానికంగా ఓ పాఠశాలతో 8వ తరగతి చదువుతోంది. అయితే ఉన్నట్టుండి కూతురు ఓ పని చేయడంతో ఆమె తల్లిదండ్రులు షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?
పైన ఫోటోలో కనిపిస్తున్న బాలి పేరు ప్రగ్యా. స్థానికంగా ఓ పాఠశాలతో 8వ తరగతి చదువుతోంది. అయితే ఉన్నట్టుండి కూతురు ఓ పని చేయడంతో ఆమె తల్లిదండ్రులు షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?
Uppula Naresh
మారిన కాలానికి అనుగుణంగా నేటి కాలం పిల్లల అలవాట్లు, వారి ప్రవర్తనలో మార్పులు సంభవిస్తున్నాయి. కొందరు పిల్లలు అయితే ప్రతీ చిన్న సమస్యను కూడా పెద్దదిగా చూస్తూ భయపడిపోతుంటారు. ఇంట్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల కష్టాలు చూడలేక తీవ్ర మనస్థాపానికి గురవుతుంటారు. ఇంతే కాకుండా చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోట్ల వెలుగు చూశాయి. ఇదిలా ఉంటే.. కర్ణాటకకు చెందిన ఓ బాలిక ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ అమ్మాయి చేసిన పనికి ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో అసలేం జరిగింది? ఆ బాలిక ఏం చేసిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక ఉడిపి జిల్లా హెర్గా సమీపంలో ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రగ్యా (13) అనే కూతురు ఉంది. తల్లిదండ్రులు చెరో చోట ఉద్యోగాలు చేస్తూ సంసారాన్ని కొనసాగిస్తున్నారు. తమ కూతురుని మణిపాల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 8వ తరగతి చదివిస్తున్నారు. అలా ఈ దంపతుల కాపురం సంతోషంగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. వీరి కూతురు ప్రగ్యా గత కొంత కాలం నుంచి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఆమె తల్లిదండ్రులు గమనించి కూతురుకి అన్ని వివరించి చెప్పారు. ఇకపోతే.. సోమవారం సాయంత్రం ఈ బాలిక స్థానికంగా ఉన్న ఓ అపార్ట్ మెంట్ పైకి ఏకంగా 8వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కొందరు వ్యక్తులు వెంటనే అప్రమత్తమై ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డ ఆ బాలికను దగ్గరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆ బాలిక చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు విడిచింది. ఉన్నట్టుండి కూతురు ఇంత పని చేయడంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మొన్నటి వరకు తల్లిదండ్రుల కళ్లముందు ఆడిపాడిన కూతురు.. ఇక తిరిగి రాదు, కనిపించదు అనే నిజాన్ని జీర్ణించుకోలేక శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. డిప్రెషన్ తో బాధపడుతూ చివరికి ఆత్మహత్య చేసుకున్న ప్రగ్యా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.