iDreamPost

తల్లిని పారతో కొట్టి చంపిన కొడుకు! ఎందుకో తెలుసా?

తల్లిని పారతో కొట్టి చంపిన కొడుకు! ఎందుకో తెలుసా?

ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు సొంత ప్రయోజనాల కోసం తోబుట్టువులతో గొడవలకు దిగుతున్నారు. ఇక అవసరమైతే వారిని హత్య చేసేందుకు కత్తులు కూడా నూరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఓ యువకుడు కని పెంచిన తల్లిని అతి దారుణంగా పొలంలో పారతో కొట్టి చంపాడు. ఈ ఘటన విషయం చివరికి పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామం. ఇదే ఊరికి చెందిన తమ్మినవేణి కనకవ్వ (60) కు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు వినోద్ సంతానం. భర్త గతంలో మరణించడంతో అప్పటి నుంచి కొడుకు, కూతుళ్లను చూసుకుంటూ ఉండేది. అయితే.. భర్త మరణానంతరం ఉన్న ఎకరా భూమిని కనకవ్వ తన కుమారుడి పేరిట చేసింది. ఇదిలా ఉండగా.. తిమ్మపురం మండలం రేణుగుంటలో కనకవ్వకు ఆమె తల్లిదండ్రులు రెండెకరాల భూమిని రాసిచ్చారు. ఈ భూమిని కూడా తన పేరు మీదే రాయాలని వినోద్ తల్లి కనకవ్వను గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. దీనికి తల్లి వ్యతిరేకిస్తూ వచ్చింది.

ఇదే విషయంపై తల్లికొడుకు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జంగపల్లిలో ఉన్న ఎకరా పొలంలోకి భారీగా గండ్లు పడ్డాయి. వీటిని పూడ్చేందుకు వినోద్ ఇటీవల పొలానికి వెళ్లాడు. ఈ విషయం తల్లి కనకవ్వకు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకుంది. నా పొలంలో నువ్వెందుకు గండ్లు పూడుస్తున్నావని కనకవ్వ కొడుకుని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే తల్లికొడుకు ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన కుమారుడు వినోద్.. చేతిలో ఉన్న పారతో తల్లిపై తీవ్రంగా దాడి చేశాడు.

దీంతో కనకవ్వ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతురాలి కూతుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆస్తి కోసం కన్న తల్లిని దారుణంగా హత్య చేసిన కుమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: దారుణం: మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన గ్రామస్తులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి