iDreamPost

రాత్రిళ్లు రోజూ టార్చర్ పెట్టిన భర్త! తట్టుకోలేని భార్య..!

రాత్రిళ్లు రోజూ టార్చర్ పెట్టిన భర్త! తట్టుకోలేని భార్య..!

ఈమె పేరు వరలక్ష్మి. 13 ఏళ్ల కిందట వరుణ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. అలా కొన్నాళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే కొన్ని రోజుల తర్వాత భర్త విజయ్ కుమార్ తాగుడుకు బానిసయ్యాడు. ఇంతేకాకుండా చాలా చోట్ల అప్పులు కుప్పలు చేశాడు. వీటన్నిటినీ తీర్చాలంటే పుట్టింటి నుంచి డబ్బులు తీసుకు రావాలని భర్త భార్యను తరుచు టార్చర్ చేస్తుండేవాడు. రాను రాను ఇతడి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇక తట్టుకోలేకపోయింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామగుండంలోని వీర్లపల్లికి చెందిన వరలక్ష్మికి గట్టెపల్లికి చెందిన వరుణ్ కుమార్ తో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి ఈ దంపతులకు ఓ కుమారుడు, కూతురు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉండేవారు. అయితే రాను రాను భర్త వరుణ్ కుమార్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో పాటు చాలా చోట్ల అప్పులు కూడా చేశాడు. ఇవన్నీ తీర్చే మార్గం అతడికి ఎక్కడా కూడా కనిపించలేదు.

దీంతో అతడు రాత్రిళ్లు తాగి ఇంటికి వచ్చి.. చేసిన అప్పలు తీర్చాలంటే పుట్టింటి నుంచి డబ్బులు తీసుకు రావాలని భార్యను తరుచు టార్చర్ చేస్తుండేవాడు. భర్త దారుణాలపై చేసేదేంలేక ఆ మహిళ కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడుతూ ఉండేది. కాగా, విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు సైతం వరలక్ష్మిని వేధించినట్లుగా తెలుస్తుంది. అయితే రోజు రోజుకి వరుణ్ కుమార్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. కట్ చేస్తే.. మంగళవారం రాత్రి వరలక్ష్మి ఇంట్లో ఉరికి వేలాడుతూ శవమై కనిపించింది.

ఇదే విషయం మృతురాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే అక్కడికి చేరుకుని కూతురుని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత ఈ ఘటనపై వరలక్ష్మి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె అత్తింటి కుటుంబ సభ్యులు చాలా కాలంగా వేధించారని, తాజాగా ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి