iDreamPost
android-app
ios-app

5 ఏళ్లుగా సహజీవనం.. ప్రియుడు అనుమానిస్తున్నాడని..

5 ఏళ్లుగా సహజీవనం.. ప్రియుడు అనుమానిస్తున్నాడని..

ఆమెకు పెళ్లయి.. ఆరేళ్ల కూతురు కూడా ఉంది. భర్తతో గొడవల కారణంగా వేరుగా ఉంటున్న ఆమె.. తనకంటే చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరూ ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, యువకుడి అనుమాన బుద్ధి కారణంగా వారి సహజీవనంలో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు పెరగటంతో మహిళ దారుణానికి పాల్పడింది. యువకుడ్ని కత్తితో పొడిచి చంపేసింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కేరళలోని కన్నూరుకు చెందిన జావీద్‌ అనే 28 ఏళ్ల వ్యక్తి ఉపాది నిమిత్తం బెంగళూరు వచ్చి స్థిరపడ్డాడు. అక్కడ ఓ సెల్‌ఫోన్‌ షాపులో పని చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి ఐదేళ్ల క్రితం రేణుక అనే మహిళతో పరిచయం అయింది. రేణుకకు పెళ్లయి ఓ పాప ఉండింది. భర్తతో గొడవల కారణంగా ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఈ విషయం తెలిసినా కూడా జావీద్‌ ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ గత ఐదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. కొంత కాలం వీరి సహజీవనం సాఫీగానే సాగింది.  ఆ తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి.

జావీద్‌.. రేణుకను అనుమానించసాగాడు. తరచుగా ఇద్దరూ గొడవలు పడుతూ ఉండేవారు. ఆ గొడవలు రోజురోజుకు పెరగసాగాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం కూడా ఇద్దరికీ గొడవైంది. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన రేణుక అతడ్ని కత్తితో పొడిచింది. కత్తి పోట్ల కారణంగా తీవ్ర గాయాలపాలైన జావీద్‌ గట్టిగా అరుస్తూ కుప్పకూలాడు. అతడి అరుపులు విని స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడిఉన్న జావీద్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జావీద్‌ చనిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేణుకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş