ఆఫీసులో మహిళా ఉద్యోగి గలీజ్ దందా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు!

ఆఫీసులో మహిళా ఉద్యోగి గలీజ్ దందా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు!

ఈ మధ్యకాలంలో కొందరు మహిళా ఉద్యోగులు గలీజ్ దందాకు తెర లేపుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజు కొక చోట వెలుగు చూస్తునే ఉన్నాయి. అచ్చం ఇలాగే ఓ మహిళా ఉద్యోగి ఆఫీసులో అలా చేస్తూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు షాక్ గురవుతున్నారు. ఆఫీసులో ఉండి ఇదేం పని మేడం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ ఈజీఎస్ ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్ గా విజేశ్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా దీపిక విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల రామాజీపేట గ్రామానికి చెందిన కోల శంకరయ్య అనే రైతు సొంత డబ్బులు వెచ్చించి పశువుల పాక నిర్మించుకున్నాడు. దీంతో ఆ రైతు ఇటీవల ఎంబీ రికార్డు కోసం విజేశ్, దీపిక అధికారులను సంప్రదించాడు. దీంతో ఆ అధికారులు రూ.8 వేలు లంచం ఇవ్వాలంటూ ఆ రైతును డిమాండ్ చేశారు. షాక్ గురైన ఆ రైతు వెంటనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇక రైతు ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ అధికారులు.. ఆఫీసులో శంకరయ్య నుంచి రూ.4 వేలు తీసుకుంటుండగా ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: విషాదం: చదువు ఇష్టం లేక గోదావరి నదిలో దూకిన ఇంటర్ విద్యార్థి!

Show comments