Venkateswarlu
Venkateswarlu
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత వీధికో సెలెబ్రిటీ తయారయ్యాడు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి వాటిల్లో పేరుతో పాటు డబ్బుకూడా సంపాదించుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. టాలెంట్‌ను నిరూపించుకోవటానికి సోషల్ మీడియా ఓ అద్భుతమైన వేదికగా మారింది. అయితే, తొందరగా ఫేమస్ అయిపోవాలన్న ఆలోచనతో చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఆ పిచ్చి పనులతో ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా లేకపోలేదు. ఇక, ఈ తాజా ఘటనలో తల్లీకూతుళ్లు ఏకంగా రైల్వే ట్రాక్‌పై యూట్యూబ్ షాట్స్ చేశారు.
ఇదే వారి కొంప ముంచింది. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన మీనా కుమారికి ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్‌లో షాట్స్ చేసి పెడుతూ ఉంటుంది. అయితే, తన సబ్‌స్క్రైబర్స్‌తో పాటు కొత్త వాళ్లను ఆకర్షించడానికి వింత వింత వీడియోలు చేస్తూ వస్తోంది. ఇందుకు ఆమె కూతురు సహకరిస్తోంది. కూతురు సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తూ ఉంటే.. తల్లి వాటిలో నటిస్తూ ఉంటుంది. అయితే, ఏది లీగల్, ఏది ఇల్లీగల్ అన్న విషయం వారికి తేలీదెమో.. ఏకంగా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి పర్మీషన్ లేకుండా వీడియోలు తీయటం మొదలుపెట్టారు.
కొద్ది రోజుల క్రితం ఇద్దరూ ఆగ్రా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లారు. మొదట ఫ్లాట్ ఫాంపై ఓ డ్యాన్స్ వీడియో తీశారు. తర్వాత రైలు పట్టాలపైకి కూడా చేరారు. ‘అబ్ తెరె బిన్ హమ్ బి జీ లేంగే’ అనే పాటకు మీనా పట్టాలపై డ్యాన్స్ చేసింది. దీన్నంతా ఆమె కూతురు వీడియో తీసింది. పక్క పట్టాలపై రైలు వెళుతున్నా ఏ మాత్రం బయపడకుండా ఇద్దరూ వీడియో తీశారు. తర్వాత దాన్ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో రైల్వే పోలీస్‌ల దృష్టికి కూడా పోయింది. దీంతో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
आगरा में रेलवे ट्रेक पर प्लेटफार्म पर मां बेटी ठुमके लगा रही थी । माँ बेटी ने बीच रेलवे ट्रेक पर बनाई थी रील,
आरपीएफ ने मां बेटी को पकड़ा और हवालात की कार्यवाही जारी है@RPF_INDIA @spgrpagra @DeepikaBhardwaj @Uppolice pic.twitter.com/jsi6b6fqoy— Madan Mohan Soni (@madanjournalist) July 23, 2023