వీడియో: 40 అడుగుల జైలు గోడ దూకి అత్యాచార ఖైదీ పరార్‌!

అతడో ఖైదీ. అత్యాచారం చేసిన కేసులో గత కొన్ని నెలలుగా జైల్లో ఉంటున్నాడు. నాలుగు గోడల మధ్య నలగటం ఇష్టంలేని అతడు జైలు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. దాదాపు 40 అడుగుల ఎత్తు ఉన్న జైలు గోడ మీదనుంచి అవతలికి దూకి పారిపోవాలని అనుకున్నాడు. అనుకున్న దాని ప్రకారం గోడ దగ్గర ఎవ్వరూ లేని సమయంలో దాని పైకి ఎక్కాడు. ఆ తర్వాత ఎత్తు అని కూడా భయం లేకుండా కిందకు దూకాడు. ఈ ప్రయత్నంలో అతడి కాలుకు గాయం అయింది.

అయినా అతడు వెనకడుగు వేయలేదు. కిందపడ్డ వెంటనే పైకి లేచి అక్కడినుంచి వెళ్లిపోయాడు. రోడ్డు మీద వెళుతున్న ఆటోను ఆపి అక్కడినుంచి దర్జాగా జంప్‌ అయ్యాడు. కర్ణాటకలోని దావణగెరె సబ్‌ జైల్లో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వటంతో విషయం బయటకు తెలిసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘‘ ఇలాంటి సంఘటనలు సినిమాల్లో చూస్తూ ఉంటాం.

కానీ, రియల్‌గా చూడ్డం ఇదే మొదటిసారి’’.. ‘‘ ఆ ఖైదీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.. కొంచెం అటుఇటు అయినా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా సాహసం చేశాడు’’.. ‘‘ సబ్‌ జైల్లో నిఘా ఏంటి అంత దారుణంగా ఉంది. ఎ‍వ్వరూ పట్టించుకోవటం లేదేంటి?’’..‘‘ సబ్‌ జైల్లో భద్రత చాలా దారుణంగా ఉంది. లేదంటే ఖైదీ అంత ఈజీగా పారిపోతాడా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, దావణగెరె సబ్‌ జైలు నుంచి అత్యాచార ఖైదీ పారిపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments